- Telugu News Entertainment Tollywood Aishwarya Rai Bachchan injured on her right arm leaves for Cannes Film Festival with daughter Aaradhya
Aishwarya Rai: అయ్యో పాపం ఐశ్వర్యకు ఏమైంది..? చేతికి కట్టుతో కనిపించిన ప్రపంచ సుందరి
అందాల తార ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లారు.
Updated on: May 16, 2024 | 3:40 PM

అందాల తార ఐశ్వర్య రాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ , ఆమె కుమార్తె ఆరాధ్య గత రాత్రి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఎప్పటిలానే ఐష్ అందంగా స్టైలిష్ గా కనిపించింది కానీ ఊహించని విధంగా చేతికి కట్టుతో కనిపించింది. దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఐష్ కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించింది. దాంతో ఆమెకు ఏమైంది. చేతికి గాయం ఎలా అయ్యింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఐష్ చేతికి ఏమైందో తెలియాల్సి ఉంది.

ప్రతిష్టాత్మకమైన ఉత్సవానికి ఐశ్వర్య ఎప్పుడూ హాజరవుతూ ఉంటుంది. ఆమె రెడ్ కార్పెట్ నడుస్తూ వస్తుంటే ఎవ్వరూ చూపుతిప్పుకోలేరు. అయితే ఈసారి ఇలా చేతికి గాయంతో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.

రెడ్ కార్పెట్‌పై ఆమె నడవగలదా..? చేతికి కట్టుతోనే ఆమె రెడ్ కార్పెట్ పై నడుస్తుందా.? ఈసారి ఆమె ఎలాంటి డ్రస్ లో మెరుస్తుందో చూడాలి అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.




