Viral Video: వర్షంలో పుష్ప హుక్ స్టెప్.. కూల్‌గా కుమ్మేశాడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2ః ది రూల్’ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఆగస్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.

Viral Video: వర్షంలో పుష్ప హుక్ స్టెప్.. కూల్‌గా కుమ్మేశాడు..
'pushpa Pushpa' Step
Follow us

|

Updated on: May 16, 2024 | 3:13 PM

ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ ఏంటి అంటే.. పుష్ప: ది రూల్‌ నుంచి రిలీజైన సాంగ్‌లోని హుక్ స్టెప్ అని చెప్పాలి. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ స్టెప్ ఫీవర్‌తో ఊగిపోతుంది. సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు, సామాన్సులు సైతం అల్లు అర్జున్ స్టెప్పుకు కాలు కదుపుతున్నారు. పుష్పా.. పుష్పా… ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే రీసౌండింగ్ వస్తోంది. తాజాగా వర్షంలో ఓ వ్యక్తి ఈ స్టెప్పును రీ క్రియేట్‌ చేయగా.. మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇన్ స్టాలో అతని పేరు తారక్ అని ఉంది. అల్లు అర్జున్ పాటలో భీకరమైన రూపంలో డ్యాన్స్ చేయగా.. తారక్ వర్షపు వీధుల్లో కూల్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో పోస్ట్‌కు 50,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. దాదాపు 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

వీడియో దిగువన చూడండి… 

View this post on Instagram

A post shared by T H A R A K (@tharak_xavier)

తాజాగా పుష్ప 2 నుంచి నటి అనసూయ ఫస్ట్ లుక్ వచ్చేసింది. మే 15న ఆమె పుట్టిన రోజు కావడంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది యూనిట్. చీర కట్టి.. నడుముకు వడ్డాణం చుట్టి.. ఎర్ర చందనం స్టాక్ చేసిన చోట.. ఓ చెక్కపై కూర్చుని.. కిల్లీ నలుముతూ కనిపిస్తోంది ఈ బ్యూటీ. పక్కనే లిక్కర్ బాటిల్ కూడా ఉంది.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, రావు రమేశ్‌, జగదీష్‌ ప్రతాప్ బండారి, అజయ్‌,  అనసూయ భరద్వాజ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే