Nindha Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో నింద టీజర్.. వరుణ్ సందేశ్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే..

కొన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ షో తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ తిరిగి వెండితెరపై సందడి చేస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత వరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నింద. మర్డర్ థ్రిల్లర్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాను ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తున్నారు. నింద టైటిల్ కు కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు.

Nindha Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో నింద టీజర్.. వరుణ్ సందేశ్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే..
Nindha Teaser
Follow us

|

Updated on: May 16, 2024 | 2:47 PM

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆ వెంటనే కొత్త బంగారు లోకం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్.. ఆ తర్వాత మాత్రం స్లో అయ్యాడు. కొత్త బంగారు లోకం హిట్ తర్వాత ఈ హీరో నటించిన ఏ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా అటు అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిన వరుణ్ కొంతకాలం అక్కడే ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ షో తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ తిరిగి వెండితెరపై సందడి చేస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత వరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నింద. మర్డర్ థ్రిల్లర్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాను ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తున్నారు. నింద టైటిల్ కు కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఇప్పటికే నింద సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. వీడియో చూస్తుంటే మర్డరీ మిస్టరీ నేపథ్యంతో స్పెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు.. అనే డైలాగ్ తో మొదలైన టీజర్ చాలా ఆసక్తిగా సాగింది. అలాగే ఈ సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీజర్ విజువల్స్ న్యాచురల్ గా ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇందులో వరుణ్ సీరియస్ లుక్కులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత నింద సినిమాతో వరుణ్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నింద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో