AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavithra Jayaram: కారు యాక్సిడెంట్ వల్ల కాదు.. పవిత్ర చనిపోవడానికి కారణం అదే.. భర్త చంద్రకాంత్ కామెంట్స్..

శేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు, భర్త చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. అయితే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు ఆమె భర్త చంద్రకాంత్. రోడ్డు ప్రమాదం కాకుండా పవిత్ర మరణానికి అసలు కారణం వెల్లడించాడు.

Pavithra Jayaram: కారు యాక్సిడెంట్ వల్ల కాదు.. పవిత్ర చనిపోవడానికి కారణం అదే.. భర్త చంద్రకాంత్ కామెంట్స్..
Pavithra Jayaram, Chandu
Rajitha Chanti
|

Updated on: May 16, 2024 | 2:26 PM

Share

బుల్లితెరపై త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పవిత్ర జయరామ్. విలనిజంలో తనదైన నటనతో ఆకట్టుకున్న పవిత్ర రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన పవిత్ర అకాల మరణంతో అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక నుంచి హైదరబాద్ వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు, భర్త చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. అయితే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు ఆమె భర్త చంద్రకాంత్. రోడ్డు ప్రమాదం కాకుండా పవిత్ర మరణానికి అసలు కారణం వెల్లడించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవిత్ర మరణం గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించాడు చంద్రకాంత్. కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు తామంతా బెంగళూరు వెళ్లామని.. అక్కడ ప్రాజెక్టుకు సంతం చేసి కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నామని అన్నారు. “నేను, పవిత్ర కారులో వెనకాల కూర్చొగా.. పవిత్ర సోదరి కూతురు డ్రైవర్ పక్కన కూర్చుంది. మేమందరం గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్ ను ఢీకొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్ లోకి వెళ్లిపోయింది.

అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు రావడం వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు చెప్పారు. నాకు దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయాను. తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన తర్వాత పవిత్ర చనిపోయిన విషయం తెలిసింది. మేము భార్యాభర్తలము అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకున్నాము. అంతలోనే తను నన్ను విడిచి వెళ్లిపోయింది” అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్రకాంత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.