AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sirisha: భర్తతో విడాకులు తీసుకున్న సీరియల్ నటి.. విడిపోవడానికి కారణం అదేనంటూ పోస్ట్..

ఇటీవలే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి విడాకుల గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది. తమ జీవితం గురించి అనవసరమైన విషయాలను ప్రచారం చేస్తున్నారంటూ.. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని జీవీ ప్రకాష్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది.

Actress Sirisha: భర్తతో విడాకులు తీసుకున్న సీరియల్ నటి.. విడిపోవడానికి కారణం అదేనంటూ పోస్ట్..
Sirisha
Rajitha Chanti
|

Updated on: May 16, 2024 | 3:37 PM

Share

సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయ్యింది. కొన్నాళ్లుగా చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. కానీ విడిపోవడానికి గల కారణాలు మాత్రం బయటపెట్టడం లేదు. దీంతో తారల వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. వారి విడాకులకు గల కారణాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి విడాకుల గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది. తమ జీవితం గురించి అనవసరమైన విషయాలను ప్రచారం చేస్తున్నారంటూ.. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని జీవీ ప్రకాష్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది.

సీరియల్ నటి శిరీష తన భర్త నవీన్‏తో విడిపోయినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోట్ షేర్ చేసింది. “నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాం. నేను, నవీన్ భార్యాభర్తలుగా విడిపోయాం. మా నియంత్రణలో లేని కొని్ని పరిస్థితుల కారణాంగా మేము ఇద్దరం విడిపోయాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. వీలైతే సపోర్ట్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించకండి. నాకు నవీన్ పై ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రెటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి” అంటూ పోస్ట్ చేసింది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శిరీష తెలుగులో అనేక సీరియల్లలో నటించింది. మొగలిరేకులు సీరియల్ ద్వారా మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం, పున్నాగ వంటి సీరియల్లో నటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్