AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో జమ.. రెడీగా ఉండండి..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అర్హులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వీరికి ప్రభుత్వం ఊరట కల్పించింది.

Andhra Pradesh: ఏపీలో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో జమ.. రెడీగా ఉండండి..
Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: Aug 11, 2026 | 8:30 AM

Share

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే నేతన్న సేవలో స్కీమ్. ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నేతన్నలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు కూటమి సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి అందకపోతే దరఖాస్తులను మళ్లీ పరిశీలిస్తామని తెలిపింది. అర్హులను మరోసారి గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆగస్ట్ 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నగదు జమ చేసిన విషయం తెలిసిందే.

వారం రోజుల్లో నగదు జమ

సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమందికి డబ్బులు పడలేదనే వార్తలపై స్పందించారు. అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 71,536 మందికి రూ.25 వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. అర్హులైనవారిని గుర్తించి అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం కోసం 13,678 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వారి అప్లికేషన్లను పరిశీలించి వారం రోజుల్లో రూ.25 వేలు అందిస్తామని తెలిపారు. చేనేతల కుటుంబానికి తమ కుటుంబం కట్టుబడి ఉందని, 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. 85,678 మంది పింఛన్లు ఇప్పటికే అందుకున్నారని, అలాగే 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

నేతన్న సేవలో పథకానికి దరఖాస్తు ఎలా..?

మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తులను నింపాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లతో జత చేసి దరఖాస్తు ఫారాలను సచివాలయ అధికారులకు అందించాలి. దీంతో సచివాలయ అధికారుల పరిశీలించి మీకు అర్హత ఉంటే పై అధికారులను వివరాలు పంపిస్తారు. దీంతో మీ పేరును లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. అనంతరం మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సవిత ప్రకటించారు. ప్రతీఒక్కరికీ డబ్బులు అందుతాయని, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

Follow Us
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ND vs BAN సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?
ND vs BAN సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?
కొలంబియాను కుదిపేసిన భూకంపం.. భవనాల కింద చిక్కుకున్న వందలాది మంది
కొలంబియాను కుదిపేసిన భూకంపం.. భవనాల కింద చిక్కుకున్న వందలాది మంది