చాణక్య నీతి: తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి.. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి!
21 September 2026
Rajashekher
మన మాటలు లేదా చేతల వల్ల ఎవరైనా బాధపడితే, అహంకారానికి పోకుండా తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచిది.
తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి
తమ తప్పు తెలిసినా అహం కారణంగా మౌనంగా ఉండటం సంబంధాలను దెబ్బతీస్తుంది. తప్పును ఒప్పుకోవడం ఆత్మగౌరవాన్ని తగ్గించదు.
తప్పును అంగీకరించడం బలహీనత కాదు
ప్రతి విషయాన్ని వాదనగా మార్చి గెలవాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాదనను వదిలేయడమే మంచిది.
ప్రతి వాదనలో గెలవాలని అనుకోకండి
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చిన్న అపార్థాల వల్ల దూరం ఏర్పడితే, సమస్యను పరిష్కరించేందుకు మీరే ముందడుగు వేయడం మంచిది.
సంబంధాలను కాపాడేందుకు రాజీ పడండి
సంబంధం ముఖ్యమైనప్పుడు “నేనే ఎందుకు ముందుగా మాట్లాడాలి?” అనే అహంకారాన్ని వదిలి, ప్రశాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి.
అహంకారాన్ని పక్కన పెట్టండి
తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం వేరు.. అవమానాలను పదేపదే భరించడం వేరు. ఏ సంబంధంలోనూ మీ ఆత్మగౌరవాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.
ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోవద్దు
ప్రతీ విషయంపై వాదించడం వల్ల సమయం, శక్తి, మనశ్శాంతి వృథా అవుతాయి. పరిష్కారం లేని వాదనల నుంచి తప్పుకోవడం మంచిది.
అనవసరమైన వాదనలకు దూరంగా..
ఇద్దరూ సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటే, ఒక అడుగు వెనక్కి వేసి ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు.
సమస్యను ప్రశాంతంగా..
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్