AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర నిజాలు..

దేశాల మధ్య సరిహద్దుల కోసం యుద్ధాలు జరగడం మనకు తెలుసు.. కానీ నిశబ్దంగా కనిపించే దట్టమైన అడవుల్లోనూ సామ్రాజ్యాల కోసం భీకర పోరాటాలు జరుగుతాయని మీకు తెలుసా? నల్లమల అభయారణ్యంలో తాజాగా ఓ పెద్దపులి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇది వేటగాళ్ల పనా? లేక రెండు మృగరాజుల మధ్య జరిగిన సరిహద్దు పోరాటమా? అడవిలో పులుల సామ్రాజ్యాల వెనుక దాగున్న భీకర యుద్ధాల రహస్యాలేంటి? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర నిజాలు..
Nallamala Forest Tiger Death
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 21, 2026 | 7:35 PM

Share

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లు పల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రెండు వారాల క్రితం ఓ పెద్దపులి మృతి చెందింది. పెద్దపులి కళేబరాన్ని గమనించిన ఫారెస్ట్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద పులి మృతిపై విచారణ చేపట్టిన అధికారులు పులికి పంచనామ నిర్వహించి శరీర అవశేషాలను పోస్టు మార్టానికి పంపించారు. పెద్దపులి వయసు దాదాపు రెండున్నర సంవత్సరాలు వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పులి ఏదైనా జంతువుతో, లేదా మరో పెద్దపులితో పోరాడుతూ చనిపోయిందా. లేదా ఏదైనా విషం కలిసిన ఆహారం తిని మృతి చెందిందా… అనే విషయాన్ని పోస్టుమార్టం నివేదికలో గుర్తించవలసి ఉందని అధికారులు చెబుతున్నారు…

ఈ పెద్ద పులి కళేబరాన్ని గుర్తించే సమయానికి అప్పటికే రెండు వారాల క్రితం చనిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పెద్ద పులి మృతి వెనుక రెండు పులుల మధ్య సరిహద్దు వివాదం చోటు చేసుకుని ఉండవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒక పులి తన సరిహద్దు ప్రాంతంలోకి మరో పెద్ద పులి వస్తే వెంటనే దాడి చేస్తుంది. దీంతో ఈ రెండు పులులు తీవ్రంగా ఘర్షణ పడతాయి. ఒక పులి ఓడిపోయి పారిపోవడమో, లేక చనిపోవడమో జరుగుతుంది. అలా బొల్లుపల్లి దగ్గర చనిపోయిన పెద్దపులి సరిహద్దు ఘర్షణల్లో రెండు పులుల మధ్య జరిగిన పోరాటంలో చనిపోయి ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు పులుల మధ్య ఈ సరిహద్దు వివాదాలు ఎందుకు జరుగుతాయి.

ఒకదేశానికి, మరోదేశానికి సరిహద్దు మధ్య ఉండే వివాదాలు ఒక్కోసారి యుద్దాలకు దారితీస్తుంటాయి. అలాగే అడవుల్లో సంచరించే పులుల మధ్య కూడా సరిహద్దు వివాదాలు ఉంటాయి. పులుల మధ్య సరిహద్దు వివాదం అనేది వాటి మనుగడకు, ఆధిపత్యానికి సంబంధించిన సహజమైన ఘర్షణ. పులులు ఒంటరిగా జీవించే వన్యమృగాలు కావడం వల్ల ప్రతి పెద్దపులి తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని లేదా సరిహద్దును ఏర్పాటు చేసుకుంటుంది. ఒక పులి పరిధిలోకి మరో పులి ప్రవేశించినప్పుడు ఆ రెండు పులుల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ ఘర్షణలో ఒక పులి ఓడిపోయి పారిపోవడమో, లేక తీవ్ర గాయాలతో మరణించడమో జరుగుతుంది.

అటవీప్రాంతంలో సంచరించే పెద్దపులులు తనకు తాను ఓ సరిహద్దు సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. తన సరిహద్దులను ఇతర పులులకు తెలియజేయడానికి పెద్దపులులు కొన్ని పద్ధతులను పాటిస్తాయి. తన ప్రాంతంలోని చెట్లపై ప్రత్యేకంగా వాసన వచ్చే మూత్రాన్ని విసర్జించి సరిహద్దులను నిర్ణయిస్తాయి. అలాగే తన పదునైన గోళ్లతో చెట్లపై స్పష్గంగా గీతలు గీసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. భయంకరమైన గర్జనల ద్వారా తాము ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఇతర పులులను హెచ్చరిస్తాయి.

పెద్ద పులుల మధ్య సరిహద్దు వివాదాలకు ఆహారం, నీటి లభ్యత కూడా ముఖ్య కారణాలుగా ఉంటాయి. ఒక పులి జీవించడానికి కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరమవుతుంది. తాము వేటాడే జంతువులు, నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాన్ని దక్కించుకోవడానికి పులుల మధ్య పోటీ ఉంటుంది. మగపులులు పెరిగి పెద్దవి అవుతున్న సమయంలో తమకంటూ సొంత సామ్రాజ్యాన్ని వెతుక్కుంటాయి. ఈ క్రమంలో పాత పులులతో ఘర్షణలకు దిగుతుంటాయి. కొన్నిసార్లు తల్లి పులికి, ఎదిగిన పిల్ల పులికి మధ్య కూడా సరిహద్దు పోరు జరుగుతుంది. అలాగే ఆడపులితో మగపులి జతకట్టే విషయంలో కూడా రెండు మగ పులుల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాల్లో వాటికి తీవ్ర గాయాలు అవుతుంటాయి. ప్రాణాంతక దాడులు జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డ పులి ఆ ప్రాంతాన్ని వదిలిపారిపోతుంది. లేదా చనిపోతుంది.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రెండు వారాల క్రితం చనిపోయిన పెద్దపులి మృతి విషయంలో కూడా సరిహద్దు కారణంగా రెండు పెద్దపులుల మధ్య జరిగిన ఘర్షణ కోణం కూడా ఉండవచ్చని ఫారెస్ట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు… సరిహద్దుల విషయంలో వివాదాలు మనుషుల మధ్య కాదు పెద్దపులుల మధ్య కూడా ఉంటాయి.

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!