AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తెలుగువారి సాంప్రదాయ భోజనంలో రోటి పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. అందులోనూ చలువ చేసే తాజా దోసకాయతో చేసే పచ్చడి అంటే అందరికీ అమితమైన ఇష్టం. సాధారణంగా దోసకాయ పచ్చడి అనగానే మగ్గించడం లేదా చివర్లో నూనెతో తాలింపు పెట్టడం చేస్తుంటాము. కానీ ఎలాంటి తాలింపు పెట్టే పనే లేకుండా, అతి తక్కువ నూనెతో కేవలం పచ్చికొబ్బరి కమ్మదనం, దోసకాయ క్రంచీనెస్‌తో చేసుకునే 'దోసకాయ కొబ్బరి పచ్చడి' రుచి అమోఘం! 

Phani CH
|

Updated on: Sep 21, 2026 | 9:48 PM

Share
కావలసిన పదార్థాలు: 1 మీడియం సైజు గట్టి దోర దోసకాయ, పచ్చికొబ్బరి ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె, పావు టీస్పూన్ మెంతులు , 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 5 నుండి 6 - తుంచిన ఎండుమిరపకాయలు, 3 - కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు

1 / 5
తయారీ విధానం: దోసకాయను తొక్క తీసి సగానికి కట్ చేసి గింజలు, కాయ చేదుగా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. చేదు లేకపోతే గింజలతో సహా చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి తురిమితే పచ్చడి టెక్స్చర్ పోతుంది, కాబట్టి చాకుతోనే సన్నగా తరగాలి. ఇప్పుడు కట్ చేసిన దోసకాయ ముక్కల్లో ఒక సగం ముక్కలను గ్రైండింగ్ కోసం, మిగతా సగం ముక్కలను చివర్లో కలపడానికి పక్కన ఉంచుకోవాలి. గ్రైండ్ చేసే దోసకాయ ముక్కల మధ్యలో కడిగిన చింతపండును పెట్టి కప్పి ఉంచితే, పచ్చడి రుబ్బే సమయానికి చింతపండు తేమకు మెత్తగా నానిపోతుంది.

2 / 5
బాండీలో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు టీస్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్‌పై వేయించాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి దోరగా వేపాలి. మినప్పప్పు కొద్దిగా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర వేసి నిమిషం పాటు వేయించాలి. చివరగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండూ సమపాళ్లలో వేస్తేనే పచ్చడికి అసలైన రుచి వస్తుంది.

3 / 5
మిక్సీ జార్‌లో వేయించి చల్లార్చిన దినుసులు, మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి మొదట మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు చింతపండుతో పాటు నానబెట్టిన మొదటి భాగం దోసకాయ ముక్కలను కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.

4 / 5
రుబ్బిన కొబ్బరి-దోసకాయ ముద్దను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి దోసకాయ ముక్కలను ఇందులో వేసి గరిటెతో సమంగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ సమయంలో ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొద్దిగా వేసి కలుపుకోవాలి. అంతే, ఎలాంటి పోపు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎంతో కమ్మగా ఉండే దోసకాయ కొబ్బరి పచ్చడి సిద్ధం! అన్నంలో కలుపుకుని తింటుంటే పంటికి తగిలే క్రంచీ దోసకాయ ముక్కలు, కొబ్బరి-మినప్పప్పు సువాసనలతో అమృతాన్ని తలపిస్తుంది

5 / 5
Follow Us