థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మఖానా తినొచ్చా?

21 September 2026

TV9 Telugu

TV9 Telugu

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. హైపోథైరాయిడిజం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి

TV9 Telugu

వీరిలో జీవక్రియ మందగించడం, బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. ఐతే హైపర్‌థైరాయిడిజంలో జీవక్రియ వేగంగా పనిచేస్తుంది

TV9 Telugu

ఇలాంటి వారు చిరుతిండిగా మఖానాను తీసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. మఖానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు

TV9 Telugu

సరిగ్గా తయారు చేసి, పరిమితంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి చిరుతిండిగా ఉంటుంది

TV9 Telugu

థైరాయిడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపే గోయిట్రోజెనిక్ పదార్థాలు కొన్ని ఆహారాల్లో ఉంటాయి

TV9 Telugu

ఇవి శరీరంలో అయోడిన్ వినియోగాన్ని ప్రభావితం చేసి థైరాయిడ్ హార్మోన్ల తయారీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది

TV9 Telugu

అయితే మఖానా గోయిట్రోజెనిక్ ఆహారం కాదని ,అందువల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మఖానాను పూర్తిగా దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు

TV9 Telugu

అలాగే 30 గ్రాముల మఖానాలో 110 కేలరీల కంటే తక్కువ శక్తి లభిస్తుంది. ఇందులోని పీచు, సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది