AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: ఇరుముడి సక్సెస్‌తో మాస్ రాజా కొత్త కండిషన్స్

Raviteja: ఇరుముడి సక్సెస్‌తో మాస్ రాజా కొత్త కండిషన్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 21, 2026 | 8:57 PM

Share

‘ఇరుముడి’ సక్సెస్‌ తర్వాత రవితేజ రెమ్యునరేషన్‌ డీల్‌పై టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్‌ బదులు అడ్వాన్స్‌తో పాటు నైజాం థియేట్రికల్‌ రైట్స్‌ తీసుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. సినిమా సక్సెస్‌తో ఆ డీల్‌ రవితేజకు భారీగా కలిసొచ్చింది. దీంతో తదుపరి సినిమాలకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు నైజాం హక్కులు కూడా కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై రవితేజ లేదా నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇరుముడి తర్వాత రవితేజ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయిందా..? కథలతో పాటు రెమ్యునరేషన్ గేమ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా..? ఇరుముడి ఇచ్చిన బ్లాక్ బస్టర్‌తో మాస్ రాజా ఆలోచనలు ఎలా మారుతున్నాయి..? ఏకంగా దిల్ రాజు సినిమానే ఎందుకు వదిలేసారు..? రెమ్యునరేషన్‌తో పాటు నైజాం రైట్స్ ఇస్తేనే డేట్స్ ఇస్తానంటున్నారా..? అసలు రవితేజ కొత్త కండిషన్స్ ఏంటి..? ఇరుముడి సినిమాకు ముందు కాస్త లో ఫేజ్‌లో ఉన్న రవితేజ దీనికోసం 15 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకున్నారని తెలుస్తుంది.. అందులో 8 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మిగిలిన బ్యాలెన్స్ కింద నైజాం రైట్స్ తీసుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎవరూ ఊహించని స్థాయిలో నైజాంలోనే ఏకంగా 60 కోట్లు షేర్ వసూలు చేసింది. దాంతో మాస్ రాజాకు అతిపెద్ద జాక్ పాట్‌లా మారింది. ప్రతీ సినిమా ఇరుముడి స్థాయిలో ఆడుతుందనే గ్యారెంటీ లేదు.. కానీ రవితేజ మాత్రం తన రేటును భారీగా పెంచేశారనే ప్రచారం మొదలైపోయింది. ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటుగా నైజాం హక్కులు కూడా ఇస్తేనే సినిమా చేస్తానని ఆయన కొత్త రూల్ పాస్ చేసినట్లు వార్తలైతే బాగానే వస్తున్నాయి. ఈ కారణంతోనే దిల్ రాజు సినిమా ఆగిపోయిందంటున్నారు.. హసిత్ గోలీ దీనికి దర్శకుడు. సరిగ్గా ఇదే టైమ్‌లో రవితేజ అడిగినట్లుగానే 20 కోట్లతో పాటు నైజాం ఏరియా రైట్స్ ఇవ్వడానికి నిర్మాత లక్ష్మణ్ ముందుకొచ్చారని.. దాంతో ఈ సినిమా మాస్ రాజా ఓకే చేసినట్లు తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇది రాబోతుంది. ఏదేమైనా ఇరుముడి తర్వాత కాస్త టైమ్ తీసుకున్నా సరే.. అటు మంచి కథతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా ఉండాల్సిందే అని రవితేజ గట్టిగా ఫిక్స్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్‌.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!

కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!

Follow Us