AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్.. జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్న సినిమా..

కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తాయి. కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీల మాత్రం దుమ్మురేపుతుంది.

Cinema OTT: థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్.. జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్న సినిమా..
Rao Bahadur Ott
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2026 | 6:49 AM

Share

సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై తీవ్ర నిరాశను మిగిలిస్తాయి. కానీ అవే చిత్రాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతాయి. ముఖ్యంగా ఈ తరం కుర్రాళ్లకు తెగ కనెక్ట్ అవుతాయి. అలాగే భారీ బడ్జెట్ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడతాయి.అలాంటి విలక్షణమైన, వినోదాత్మకమైన ఒక డార్క్ కామెడీ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ అయిన జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు రావు బహదూర్. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెలలో భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

కానీ ఆ సినిమా కథాంశం, మంచి రివ్యూస్ కారణంగా ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఈ చిత్రం చివరకు శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కొన్ని గంటల్లోనే భారతదేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానానికి చేరుకుంది. సుమారు 2 గంటల 46 నిమిషాల నిడివి గల ఈ సైకలాజికల్ డార్క్ కామెడీ చిత్రం ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమాగా మారుతోంది. ప్రేక్షకులే కాకుండా సినీ విమర్శకులు కూడా దీని కథను, నటనను ఎంతగానో ప్రశంసించారు. అంతేకాకుండా, ఈ సినిమా IMDbలో 8/10 రేటింగ్ పొందింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్ర కథ, ‘రామప్పారావు బహదూర్’ అనే ధనవంతుడు, వృద్ధుడు , తాగుబోతు అయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రామప్ప మనసులో ఒక భయంకరమైన అనుమానం రేకెత్తినప్పుడు కథలో అసలైన మలుపు వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు తన సొంత కొడుకు కాదని, వివాహేతర సంతానమని అతను అనుమానిస్తాడు. ఈ అనుమానం అతని జీవితంలో సృష్టించే ఉత్కంఠ, గందరగోళం చూడదగ్గవి. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో అందుబాటులో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us