వేసవిలో హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చల్లదనంతో పాటు శక్తిని అందించడానికి ఈ డ్రింక్ తాగండి..

ఈ సీజన్‌లో వేడి, ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువగా అలసిపోయినట్లు అయి.. ఏ పని చేయాలన్నా కష్టంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సీజన్ రకరకాల సహజమైన పానీయాలు, ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి హైడ్రేషన్‌తో పాటు శక్తిని అందిస్తాయి. డైటీషియన్ నవనీత్ బాత్రా తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ఈ సీజన్ లో తీసుకోవాల్సిన ఆహారాలు, పానీయాల గురించి చెప్పింది. వేసవిలో తలనొప్పి, అలసట, బలహీనత అనిపిస్తే కేవలం నీళ్లు తాగితే సరిపోదని, ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి, బితో పాటు మెగ్నీషియం కూడా శరీరానికి అందజేసే పానీయాలు తీసుకోవాలని నవనీత్ బాత్రా చెబుతున్నారు.

వేసవిలో హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చల్లదనంతో పాటు శక్తిని అందించడానికి ఈ డ్రింక్ తాగండి..
Hydrating DrinksImage Credit source: Freepik
Follow us

|

Updated on: May 16, 2024 | 3:47 PM

వేసవి కాలంలో వ్యాధులు రాకుండా శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేడికి, వడగల్పులకు చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోవడంతో ఎక్కువగా డీ హైడ్రేట్ బారిన పడతారు. కనుక ఈ సీజన్‌లో నీరు ఎక్కువగా తాగడం మంచిది. అయితే ఈ సీజన్‌లో వేడి, ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువగా అలసిపోయినట్లు అయి.. ఏ పని చేయాలన్నా కష్టంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సీజన్ రకరకాల సహజమైన పానీయాలు, ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి హైడ్రేషన్‌తో పాటు శక్తిని అందిస్తాయి.

డైటీషియన్ నవనీత్ బాత్రా తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ఈ సీజన్ లో తీసుకోవాల్సిన ఆహారాలు, పానీయాల గురించి చెప్పింది. వేసవిలో తలనొప్పి, అలసట, బలహీనత అనిపిస్తే కేవలం నీళ్లు తాగితే సరిపోదని, ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి, బితో పాటు మెగ్నీషియం కూడా శరీరానికి అందజేసే పానీయాలు తీసుకోవాలని నవనీత్ బాత్రా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

యాపిల్ జ్యూస్‌ విటమిన్ సి, ఫైబర్ మన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు అవసరమైన పోషకాలు యాపిల్ జ్యూస్‌లో ఉంటాయి. కనుక యాపిల్ జ్యూస్‌ ను వేసవిలో తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనాన్ని, శక్తిని అందిస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Lovneet Batra (@lovneetb)

షికంజి షోడా వేసవిలో రిఫ్రెష్‌గా ఉండటానికి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి షికంజి షోడాను తీసుకోవచ్చు, ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను నిర్వహించడానికి పనిచేస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కొబ్బరి నీరు కొబ్బరి నీరు శరీరానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే దీనిని అతిగా తాగడం వల్ల చాలా మందికి ముఖ్యంగా కిడ్నీ రోగులకు సమస్యలు, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అందువలన కొబ్బరి నీరు తాగాలంటే మొదట ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

పుచ్చకాయ రసం పుచ్చకాయలో సుమారుగా 97% నీరు ఉంటుంది, కాబట్టి పుచ్చకాయ రసాన్ని తీసుకుని దానిలో పింక్ ఉప్పును జోడించి తాగవచ్చు.

మజ్జిగ వేసవిలో దేశీ పానీయం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..