AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Food Combinations: ఈ ఫుడ్ కాంబినేషన్ల జోలికి అస్సలు పోకండి.. లేదంటే డేంజరే!

కొన్ని కొన్ని ఫుడ్ కాంబినేషన్లు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హెల్త్‌కి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లకు మాత్రం చాలా దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ఫుడ్ కాంబినేషన్ల వల్ల మీ ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలు రకాల సమస్యలు రావొచ్చని ఆయుర్వేదం చెబుతుంది. అయితే కొంత మంది తెలియక..

Bad Food Combinations: ఈ ఫుడ్ కాంబినేషన్ల జోలికి అస్సలు పోకండి.. లేదంటే డేంజరే!
Bad Food Combinations
Chinni Enni
|

Updated on: May 16, 2024 | 3:08 PM

Share

కొన్ని కొన్ని ఫుడ్ కాంబినేషన్లు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హెల్త్‌కి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లకు మాత్రం చాలా దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ఫుడ్ కాంబినేషన్ల వల్ల మీ ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలు రకాల సమస్యలు రావొచ్చని ఆయుర్వేదం చెబుతుంది. అయితే కొంత మంది తెలియక ఈ ఫుడ్ కాంబినేషన్స్ కలిపి తింటారు. ఆ తర్వాత అనేక సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. వీటి వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థలో వ్యర్థాలు, ట్యాక్సిన్స్ పేరుకుపోతాయి. ఈ బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల మీకు పోషకాహారాలు సరిగా అందవు. పైగా సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్ కాంబినేషన్లకు దూరంగా ఉండటం మంచిది. మరి ఆ బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పండ్లు – పాలు:

ఆయుర్వేదం ప్రకారం పండ్లు, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదు. వీటి వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాకుండా ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. కేవలం మామిడి పండ్లను మాత్రమే పాలతో కలిపి తీసుకోవచ్చు. అది కూడా తీపి మామిడి పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఇతర పండ్లతో పాలను కలిపి తీసుకోకూడదు.

పాలకూర – పనీర్:

చాలా మందికి పాలక్ పనీర్ అనేది మంచి ఫుడ్ కాంబినేషన్. చపాతీ, రోటీ, అన్నం, పులావ్ వేటిల్లో అయినా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఇష్ట పడి మరీ తింటారు. కానీ వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇవి రెండు కూడా పోషకాహారాలైన పదార్థాలు. కానీ తినకూడదు. పనీర్ లో ఉండే క్యాల్షియంను.. పాలకూరలో ఉండే ఇనుము.. శరీర శోషించుకోకుండా అడ్డు పడుతుంది.

ఇవి కూడా చదవండి

హనీ – హాట్ వాటర్:

చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. కానీ ఆయుర్వేదం ప్రకారం మాత్రం ఇలా అస్సలు తీసుకోకూడదు. ఇలా తాగడం వల్ల హెల్ప్ చేసే.. ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటి వల్ల మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు.

ఐస్ క్రీమ్ – గులాబ్ జామూన్:

పెళ్లుల్లు, ఫంక్షన్‌లలో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామూన్ తింటూ ఉంటారు. ఇది సూపర్ కాంబినేషన్. కానీ ఇలా తినడం అస్సలు మంచిది కాదని ఆయుర్వేదం చెబుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అదే విధంగా పాలు-చేపలు, ఖర్జూరం-పాలు కాంబినేషన్లు కూడా తీసుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..