AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళను వదలనంటున్న వైరస్‌.. ఇప్పటికే 12 మంది మృతి, 4 జిల్లాలకు అలర్ట్.. లక్షణాలు ఇలా..

పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న వైరస్ కేసులను ఎదుర్కోవటానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

కేరళను వదలనంటున్న వైరస్‌.. ఇప్పటికే 12 మంది మృతి, 4 జిల్లాలకు అలర్ట్.. లక్షణాలు ఇలా..
Hepatitis A Cases
Jyothi Gadda
|

Updated on: May 16, 2024 | 3:25 PM

Share

కేరళ గత కొంతకాలంగా హెపటైటిస్ ఎ వైరస్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో మొత్తం 1,977 హెపటైటిస్ ఎ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించారు. ఇది కాకుండా మరో 5,536 అనుమానిత కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న హెపటైటిస్-ఎ కేసులను ఎదుర్కోవటానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులంలో హెపటైటిస్ ఎ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి వనరులను క్లోరినేషన్ చేసి, రెస్టారెంట్లకు హీట్ వాటర్ ను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు.

హెపటైటిస్-ఎ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

హెపటైటిస్-A కాలేయం వాపు వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల వస్తుంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధిని వైరల్ హెపటైటిస్ అంటారు. వైరల్ హెపటైటిస్ మూడు ప్రధాన రకాలు A, B, C గా వర్గీకరించబడ్డాయి. హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. హెచ్ఐవీ, కాలేయ వ్యాధితో ఉన్నవారు త్వరగా హెపటైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇక దీని లక్షణాలు పరిశీలించినట్టయితే.. అలసట, కడుపునొప్పి, జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు చర్మం, గోర్లు, కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారటం ఈ వ్యాధి లక్షణాలు. కాచి చల్లార్చిన నీరు తాగడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండటం, తినేముందు చేతులు శుభ్రంగా వాష్‌ చేసుకోవడం వంటి నివారణలు చర్యలు పాటించాలని వైద్యులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..