పెళ్లి సంబరంలో పడి మూడేళ్ల కూతుర్ని కారులోనే మర్చిపోయిన పేరెంట్స్.. మూడు గంటల తరువాత చూస్తే..!
ఇద్దరు కుమార్తెలు కూడా కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్ కారును ఒక చోట పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు. తర్వాత అతడు కూడా ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లాడు. దంపతులిద్దరూ విడివిడిగా సుమారు రెండు గంటలపాటు పెళ్లికి హాజరైన వారిని కలిసి ముచ్చటించారు. చాలా సేపటి తరువాత కలుసుకున్న భార్యాభర్తలు తమ మూడేళ్ల చిన్న కుమార్తె గోర్విక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. చిన్నారి కోసం..
ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ దంపతులు పెళ్లి ఆహ్వానం మేరకు అందరూ కారులో అక్కడికి చేరుకున్నారు. కారు పార్క్ చేసి హాల్లోకి వెళ్లి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. వారు తమ బంధువులు, స్నేహితులను కలిసిన హడావుడి, తమ నగలు, అలంకరణలను ప్రదర్శిస్తూ స్టేటస్ కాపాడుకునే పనిలో నిమగ్నమైపోయారు. పెళ్లి అయిపోయింది, భోజనాలు కూడా పూర్తయ్యాయి. ఐస్ క్రీం, పాన్ తింటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతలో తమ కూతురు ఎక్కడుందోనని ఆ దంపతులు గుర్తు చేసుకున్నారు. హాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. చివరకు పరుగు పరుగున కారు దగ్గరకు వెళ్లారు. తాళం వేసి ఉన్న కారులో వెనుక సీటులో కూర్చున్న చిన్నారి విగత జీవిగా పడి ఉండటం కనిపించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని కోటకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పెళ్లి వేడుకకు కారులో వెళ్లాడు. అక్కడకు చేరుకున్న తర్వాత భార్య, పెద్ద కూతురు కారు నుంచి దిగారు. ఇద్దరు కుమార్తెలు కూడా కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్ కారును ఒక చోట పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు. తర్వాత అతడు కూడా ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లాడు. దంపతులిద్దరూ విడివిడిగా సుమారు రెండు గంటలపాటు పెళ్లికి హాజరైన వారిని కలిసి ముచ్చటించారు. చాలా సేపటి తరువాత కలుసుకున్న భార్యాభర్తలు తమ మూడేళ్ల చిన్న కుమార్తె గోర్విక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. చిన్నారి కోసం హాల్ అంతా వెతికారు. మూడు గంటల తర్వాత పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లారు. డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో అచేతనంగా పడి ఉన్న గోర్వికను చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు పేరెంట్స్ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేయలేదని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..