Mistake Surgery: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతి వేలికి బదులు.. నాలుకకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు

బాలికకు ఆపరేషన్ చేసి ఆరో వేలు తొలగించాల్సి ఉంది. కానీ, ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. వేలికి ఆపరేషన్ చేయలేదని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీయటంతో..

Mistake Surgery: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతి వేలికి బదులు.. నాలుకకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు
Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: May 16, 2024 | 8:28 PM

కేరళలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. కోజికోడ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. కానీ, అక్కడి వైద్యులు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విషయం తీవ్ర రూపం దాల్చటంతో కేరళ ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం వైద్య కళాశాలలోని ప్రసూతి, శిశు సంరక్షణ కేంద్రంలో బాలికకు ఆపరేషన్ చేసి ఆరో వేలు తొలగించాల్సి ఉంది. కానీ, ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. వేలికి ఆపరేషన్ చేయలేదని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీయటంతో నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని నర్స్‌ చెప్పింది. ఇది విని వారంతా షాక్‌ అయ్యారు. కానీ, జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు వారికి క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని చెప్పారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.

ఈ విషయంపై వెంటనే స్పందించిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నివేదికను కోరారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చేరింది. కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు