మనిషికి అత్యంత ప్రమాదకరమైన జీవి ఎదో తెలుసా..? ఏటా 7లక్షల కంటే ఎక్కువ మందిని చంపేస్తుంది..!

భూమిపై మొత్తం 1.2 మిలియన్ జాతులు ఉన్నాయి. అయితే మానవులకు అత్యంత ప్రాణాంతకమైన జీవి ఏది అని అడిగితే? ఏది ఎక్కువ మందిని చంపుతుంది. అప్పుడు బహుశా మీ సమాధానం పాము-తేలు, సింహం, మొసలి, సొరచేప కావచ్చు. కానీ సొరచేపలు ప్రతి సంవత్సరం 70 మందిని మాత్రమే చంపుతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ప్రతి సంవత్సరం అత్యధికంగా మనుషులను చంపే ఒక జీవి ఉంది. అదేంటో తెలిస్తే మీరు నిజంగానే షాక్‌ అవుతారు.

మనిషికి అత్యంత ప్రమాదకరమైన జీవి ఎదో తెలుసా..? ఏటా 7లక్షల కంటే ఎక్కువ మందిని చంపేస్తుంది..!
dangerous creature for humans
Follow us

|

Updated on: May 16, 2024 | 7:08 PM

చాలా మందికి జంతువులన్నా, చిన్న చిన్న కీటకాలన్నా ఎంతో భయం. కొందరు పామును చూసి వణికిపోతే, మరికొందరు బోనులో ఉన్న సింహాన్ని చూసి వణికిపోతారు. బొద్దింకలు, బల్లులంటే చాలా మంది భయపడతారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన జీవి ఒకటి ఉంది. ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలను హరిస్తుంది. ఆ ప్రాణాంతక జీవి పాము, తేలు, సింహం అని అందరూ ఆలోచిస్తుంటారు. కానీ, ఖచ్చితంగా అవేవీ కాదు. దీని పేరు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మన ఇళ్ల చుట్టూ కనిపించే ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేటాడుతుంది. ప్రతి సంవత్సరం దాని కాటు కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. అదేదో కాదు.. చిన్న దోమ.

అవును దోమలు మానవులకు అత్యంత ప్రమాదకరమైన జీవులు. ఇవి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ప్రతి సంవత్సరం 725,000 మందిని చంపుతాయి. ఈ అతి చిన్న సైజు జీవి ప్రపంచవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ జాతులను కలిగి ఉంది. ఆడ దోమ కుట్టడం వల్ల మలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు, ఎలిఫెంటియాసిస్, ఎల్లో ఫీవర్, డెంగ్యూ ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్, జికా వైరస్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, జనాభాలో సగానికి పైగా ప్రస్తుతం దోమల పట్టులో ఉన్నారు. ఆఫ్రికన్ దేశాలలో దోమల సంభవం చాలా ఎక్కువ. ప్రపంచంలో దోమల కాటు కారణంగా ఎక్కువ మరణాలు ఇక్కడే సంభవిస్తాయి. ప్రపంచంలోని 95 శాతం కేసులు, 96 శాతం మరణాలు ఆఫ్రికన్ ప్రాంతాలలో దోమల వల్లే సంభవిస్తాయి. దోమలు మన శరీర ఉష్ణోగ్రత, మనం పీల్చే CO2కి ఆకర్షితులవుతాయి. వాటి సంక్రమణను నివారించడానికి ఉత్తమ మార్గం దోమ తెరలను ఉపయోగించడం. ఇంట్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తూ ఉండండి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవి, వర్షాకలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త