Horoscope Today: ఆ రాశివారికి మనసులోని కోరిక నెరవేరుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (మే 17, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయిపోతాయి. ఇంటి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 17, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయిపోతాయి. ఇంటి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయిపోతాయి. ఇంటి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగంలో అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రుణ సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్యానికి అనుకూలంగా సాగి పోతుంది. ముఖ్య వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తుల్లో ఉన్నవారికి శ్రమాధిక్యత ఉన్నా రాబడికి లోటుండదు. వ్యాపారాలు లాభాల పరంగా నిల కడగా, ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఎవరి తోనూ వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక సమస్యల నుంచి ఒడ్డున పడతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బం దేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుంటాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆస్తి విష యాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగిపో తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నా లలో ఆలస్యాలు జరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త విం టారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శి స్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితులు చాలావరకు సాను కూలపడతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. రాదనుకున్న డబ్బు తప్పకుండా చేతికి అందు తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. అనుకోకుండా కొందరు స్నేహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సహాయ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. కుటుంబ వ్యవహా రాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. ఆర్థిక ప్రయత్నాల విషయంలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. శుభ కార్యాలకు హాజ రవుతారు. ఆదాయపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా కొద్దిగా అనుకూలతలు పెరుగుతాయి. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి పనీ పూర్త వుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. అధికారుల నుంచి ఆశించిన మేలు జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపా రాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధి స్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు లాభిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులకు ఎక్కువగా ఉపయోగపడతారు. లేనిపోని బాధ్యతలు మీద వేసుకోవడం మంచిది కాదు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. స్నేహితుల కారణంగా కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కుటుంబ బాధ్యతలు పంచుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. విదేశాల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. అంచనాలకు మించి రాబడి పెరు గుతుంది. ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులతో పాటు ఉద్యోగు లకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.