AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: ఈ రాశులకు శనీశ్వరుడి అనుగ్రహం.. ఐశ్వర్యవంతులు అవుతారు..!

ఒక జాతకుడు వృద్ధిలోకి రావాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా ఇందులో శని గ్రహం పాత్ర తప్పకుండా ఉంటుంది. శని అనుగ్రహం ఉన్న పక్షంలో సామాన్యుడు సైతం కుబేరుడవుతాడు. శని ఆగ్రహానికి గురైన పక్షంలో కుబేరుడైనా అష్టకష్టాలు పడడం జరుగుతుంది. శని ఒక విధంగా ఐశ్వర్యానికి, సిరిసంపదలకు కారకుడు. శని సిరిసంపదలను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలబెట్టే బాధ్యతను కూడా తీసుకుంటాడు.

Lord Shani Dev: ఈ రాశులకు శనీశ్వరుడి అనుగ్రహం.. ఐశ్వర్యవంతులు అవుతారు..!
Lord Shani Dev
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 16, 2024 | 6:23 PM

Share

ఒక జాతకుడు వృద్ధిలోకి రావాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా ఇందులో శని గ్రహం పాత్ర తప్పకుండా ఉంటుంది. శని అనుగ్రహం ఉన్న పక్షంలో సామాన్యుడు సైతం కుబేరుడవుతాడు. శని ఆగ్రహానికి గురైన పక్షంలో కుబేరుడైనా అష్టకష్టాలు పడడం జరుగుతుంది. శని ఒక విధంగా ఐశ్వర్యానికి, సిరిసంపదలకు కారకుడు. శని సిరిసంపదలను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలబెట్టే బాధ్యతను కూడా తీసుకుంటాడు. ప్రస్తుతం 2025 జూలై వరకు శని ఆరు రాశులను అనుగ్రహించడం జరుగుతోంది. అవిః మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులు. వీరికి భారీ జీతభత్యాలతో ఉద్యోగం ఇప్పించడం, వృత్తుల్లో డిమాండ్ పెంచడం, వ్యాపారాల్లో లాభాలను వృద్ధి చేయడం ద్వారా వీరిని ఐశ్వర్యవంతుల్ని చేసే అవకాశముంది.

  1. మేషం: శనీశ్వరుడు లాభ స్థానంలో ఉన్న కారణంగా ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక, ఉద్యోగంలో సైతం ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గడించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక లేదా ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. శని ఇచ్చే ఆదాయం స్థిరంగా, నిలకడగా జీవితాంతం కొనసాగే అవకాశముంటుంది. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.
  2. మిథునం: ప్రస్తుతం ఈ రాశివారికి భాగ్య స్థానంలో శని సంచరిస్తూ ఉండడం ఈ రాశివారికి అదృష్టమనే చెప్పాలి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కలుగుతుంది. విదేశీ యానానికి, విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశముంటుంది. ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం లభించే పక్షంలో అక్కడే స్థిరపడే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు రాబడి భారీగా పెరిగే సూచనలున్నాయి.
  3. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని సంచారం తప్పకుండా భాగ్య యోగం కలిగిస్తుంది. శనికి ఆరవ స్థానం యోగదాయక స్థానం. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాలకు మించిన రాబడి ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం, పొదుపు పాటించడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, మదుపులు చేయడం వంటివి జరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటుండదు.
  4. తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శని పంచమ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశముంటుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభి స్తుంది. జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాలకు మించిన రాబడి ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి బాగా శ్రమపడడం జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయపరంగా, ఆర్థికపరంగా తరచూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. అంచనాలకు మించి జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. లాభదా యక స్నేహాలు ఏర్పడతాయి. లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు అమరుతాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది.
  6. మకరం: రాశ్యదిపతి, ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉన్నందువల్ల, ఈ రాశివారికి సిరిసంపదలను బాగా వృద్ధి చేసే అవకాశముంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ప్రతి ఆదాయ ప్రయత్నమూ ఫలిస్తుంది.