Luck Astrology: వృషభ రాశిలో గురు, శుక్రులు.. ఇలా చేస్తే ఆ రాశుల వారికి అదృష్టం పట్టడం పక్కా..!

ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు గురు, శుక్రులు వృషభ రాశిలో కలిసి ఉంటారు. అదృష్టానికి ప్రతీకలైన ఈ రెండు గ్రహాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. అయితే, మిగిలిన ఆరు రాశులు అంటే, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశులకు అంతగా అదృష్టం పట్టే అవకాశం లేదు.

Luck Astrology: వృషభ రాశిలో గురు, శుక్రులు.. ఇలా చేస్తే ఆ రాశుల వారికి అదృష్టం పట్టడం పక్కా..!
Luck Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 16, 2024 | 4:36 PM

ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు గురు, శుక్రులు వృషభ రాశిలో కలిసి ఉంటారు. అదృష్టానికి ప్రతీకలైన ఈ రెండు గ్రహాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. అయితే, మిగిలిన ఆరు రాశులు అంటే, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశులకు అంతగా అదృష్టం పట్టే అవకాశం లేదు. వీరు కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి, ధన యోగాలు పట్టడానికి, పదోన్నతులు సంపాదించడానికి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పండించుకోవడానికి, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంది.

  1. మిథునం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో గురు, శుక్ర గ్రహాలు కలవడం వల్ల ప్రతి ప్రయత్నమూ నిష్ఫలమవుతూ ఉంటుంది. ఎంత సంపాదించినా వృథా అయిపోతూ ఉంటుంది. అనారోగ్యాలు, వృథా ప్రయాణాలు, గుర్తింపు లేకపోవడం వంటివి జరుగుతాయి. వీటి నుంచి బయటపడి అదృష్టం పండించుకోవడానికి మరకతం దగ్గర పెట్టుకోవడం, ఇంట్లో మల్లెపూవు మొక్కను పెంచడం వంటివి చేయడం మంచిది. లేదా లలితా సహస్ర నామం పఠించడం వల్ల కూడా అదృష్టం పడుతుంది.
  2. సింహం: ఈ రాశికి దశమ స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం పెరుగుతుంది కానీ, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్త వచ్చు. ఒక పట్టాన ఏదీ కలిసి రాదు. రావలసిన డబ్బు ఆగిపోతుంది. వీటి నుంచి బయటపడా లంటే ఎరుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం, మందారపు మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కూడా అదృష్టం పండుతుంది.
  3. తుల: ఈ రాశికి గురు, శుక్రులు అష్టమ స్థానంలో యుతి చెందడం వల్ల కుటుంబ పరిస్థితులు అనుకూ లంగా మారుతాయి కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు తలెత్తవచ్చు. పురోగతి ఆగిపో యినట్టవుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడి అదృష్టం పండించుకోవాలంటే సుందర కాండ పారాయణం చేయడం మంచిది. ఎక్కువగా గోధుమ రంగు దుస్తులను ధరించడం వల్ల ఈ పరిస్థి తుల్లో మార్పు రావడంతో పాటు ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి షష్ట స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల ఎంత సంపాదించినా డబ్బు వృథా అయి పోతుంటుంది. విలువైన వస్తువులు కోల్పోవడం, ఆస్తి వివాదాల్లో అపజయాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. వీటి నుంచి విముక్తి లభించాలన్న పక్షంలో విష్ణు సహస్ర నామం పఠిం చడం లేదా కాలభైరవాష్టకం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నీలం రంగు దుస్తులు ధరించడం లేదా నీలం రాయిని ధరించడం వల్ల మంచి జరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు, శుక్రుడు కలవడం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశముండదు. గృహ, వాహన సౌకర్యాల విషయంలో డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. ఎరుపు లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల, కెంపు, పగడం వంటి రాళ్లను ధరించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నరసింహ స్వామి స్తోత్రం పఠించడం వల్ల కూడా కష్టనష్టాలు తొలగిపోయి, సుఖ సంతోషాలు అనుభవించడం జరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర, గురుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండదు. ఆర్థికంగా కూడా పురోగతి ఆగిపోతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆదాయ వృద్ధి, పదో న్నతి, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం వంటివి అనుభవానికి రావాలన్న పక్షంలో తెలుపు రంగు దుస్తులు ధరించడం, పగడం పెట్టుకోవడం, గణపతి స్తోత్రం లేదా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వంటివి చేయడం వల్ల శుభాలు జరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?