Shukra Gochar 2024: వృషభ రాశిలోకి శుక్రుడు.. అక్రమ పరిచయాల పట్ల ఆ రాశుల వారు జాగ్రత్త

జాతక చక్రంలో శుక్ర గ్రహం ఉచ్ఛ, స్వస్థానాల్లో ఉన్నా, కుజుడితో కలిసినా, సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలవుతుంది. శుక్రుడు సుఖాభిలాషి. తన సంతోషం కోసం ఏ పనైనా చేసే తత్వం ఉంటుంది. శృంగారానికి, ప్రేమ వ్యవహారాలకు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు తన స్వస్థానమైన వృషభ రాశిలోకి ఈ నెల 19 నుంచి ప్రవేశించి దాదాపు నెల రోజుల పాటు ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశులవారు భావోద్వేగాలు,

Shukra Gochar 2024: వృషభ రాశిలోకి శుక్రుడు.. అక్రమ పరిచయాల పట్ల ఆ రాశుల వారు జాగ్రత్త
Shukra Gochar 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 15, 2024 | 4:48 PM

జాతక చక్రంలో శుక్ర గ్రహం ఉచ్ఛ, స్వస్థానాల్లో ఉన్నా, కుజుడితో కలిసినా, సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలవుతుంది. శుక్రుడు సుఖాభిలాషి. తన సంతోషం కోసం ఏ పనైనా చేసే తత్వం ఉంటుంది. శృంగారానికి, ప్రేమ వ్యవహారాలకు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు తన స్వస్థానమైన వృషభ రాశిలోకి ఈ నెల 19 నుంచి ప్రవేశించి దాదాపు నెల రోజుల పాటు ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశులవారు భావోద్వేగాలు, ఉద్రేకాలకు గురయ్యే అవకాశముంటుంది. దాంపత్య జీవితం పటిష్టం అవుతుంది లేదా అక్రమ సంబంధాలకైనా అవకాశ ముంటుంది. వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారు ఇటువంటి విషయాల్లో శుక్రుడి ప్రభావానికి లోనయ్యే అవకాశముంది.

  1. వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల తప్పకుండా దాంపత్య జీవితం మరింతగా సుఖ మయం అవుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. కుటుంబ బాధ్యతల మీద బాగా శ్రద్ధ పెట్టడం, కుటుంబ బాగోగుల గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో, ఆదాయం పెంచుకోవడంలో విజయవంతం అవు తారు. విలాస జీవితానికి అలవాటు పడతారు. బాగా విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పదకొండవ స్థానంలో, అంటే లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. దాంపత్య జీవితానికి ప్రాధాన్యం ఇస్తూనే ఇతరులతో సంబం ధాలకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్త్రీలతోనే పరిచయాలు పెంచుకోవడం జరు గుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందువల్ల, విలాస జీవితం గడపడం, వ్యక్తిగత సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతాయి. సతీమణితో బంధం పటిష్టమవుతుంది.
  3. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ వ్యవహారాలు ఓ వెలుగు వెలుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి సతీమణితో అనుబంధం బలపడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి అక్రమ, అనవసర పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. స్త్రీల మీద బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. విహార యాత్రలకు వెళ్లడం కూడా జరుగుతుంది. దాంపత్య జీవితానికి ఇబ్బంది ఉండదు. సంపన్నులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.
  4. తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపచ్చాలున్నా, వివాదాలున్నా తొలగిపోయే అవకాశం ఉంది. విడాకులు ఉపసంహ రించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం అంచనాలకు మించి పెరగడం వల్ల సతీ సమేతంగా విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. విలాస జీవితం అలవడే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో కొద్దిగా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అక్రమ సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి. ఎక్కువగా స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. కోరికలు హద్దులు దాటే ప్రమాదం కూడా ఉంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. స్నేహితురాళ్లకు కానుకలు కొనివ్వడంపై ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
  6. మీనం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఇతరులతో భావోద్వేగపరంగా సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో అక్రమ పరిచయాలు ఏర్పడే సూచనలున్నాయి. స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. స్నేహితురాళ్ల మీద భారీగా ఖర్చు పెట్టడం, వారితో విహార యాత్రలు చేయడం వంటివి జరుగుతాయి. అయితే, దాంపత్య జీవితాన్ని కూడా మరింత పటిష్టంగా కొన సాగించడం జరుగుతుంది. అక్రమ పరిచయాలు విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ