దిన ఫలాలు (మే 16, 2024): ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 16, 2024): మేష రాశి వారికి ఈ రోజంతా బాగా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు చాలావరకు పూర్తయి ఊరట లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (మే 16, 2024): ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 16th May 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 16, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 16, 2024): మేష రాశి వారికి ఈ రోజంతా బాగా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు చాలావరకు పూర్తయి ఊరట లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా బాగా సానుకూలంగా సాగిపోతుంది. గురు బలం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే అవ కాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కష్టపడి పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకున్న పనులు చాలావరకు పూర్తయి ఊరట లభిస్తుంది. ఆదాయంతో పోటీగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదవం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి. పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ బాధ్యతల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం లాభ సాటిగా సాగిపోతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారులకు దగ్గరవుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలుండవచ్చు. పోటీదార్ల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో శ్రమ తక్కువ, లాభం ఎక్కువ అన్న ట్టుగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషా లకు లోటుండదు. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. అన్ని విధాలు గానూ సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రోజంతా సీదా సాదాగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఇంటా బయటా ఆశించిన సహకారం లభి స్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది.. కొందరు చిన్ననాటి మిత్రులతో ఒక శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభా లకు అవకాశముంది. బంధువులు, స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు అదుపులో ఉంటాయి. అనవసర పరిచయాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశముంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆశించిన శుభ వార్తలు వింటారు. ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యో గంలో అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

Latest Articles
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..