Sun Transit 2024: వృషభ రాశిలో రవి.. ఆ రాశుల వారికి అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి..!

సాధారణంగా ఒక్కో రాశివారికి ఒక్కో రకమైన సమస్యలుంటావి. చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. జాతక చక్రంలో గ్రహ రాజు రవి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ఎటువంటి సమస్యయినా పరిష్కారమయ్యే అవకాశముంటుంది. వృషభ రాశిలో ప్రవేశించిన రవి గ్రహం జూన్ నెల 15 వరకూ వృషభ రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది.

Sun Transit 2024: వృషభ రాశిలో రవి.. ఆ రాశుల వారికి అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి..!
Sun Transit 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 15, 2024 | 4:23 PM

సాధారణంగా ఒక్కో రాశివారికి ఒక్కో రకమైన సమస్యలుంటావి. చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. జాతక చక్రంలో గ్రహ రాజు రవి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ఎటువంటి సమస్యయినా పరిష్కారమయ్యే అవకాశముంటుంది. వృషభ రాశిలో ప్రవేశించిన రవి గ్రహం జూన్ నెల 15 వరకూ వృషభ రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. ఈ నెల రోజుల కాలంలో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశివారు కొన్ని కీలకమైన వ్యక్తిగత, కుటుంబ, ధన, ఉద్యోగ, వ్యాపార సమస్యల నుంచి బయటపడే అవకాశముంది.

  1. మేషం: ఈ రాశివారికి పంచమాధిపతిగా బాగా శుభుడైన రవి ప్రస్తుతం ధన స్థానంలో ప్రవేశించినందువల్ల అంచనాలకు మించి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడం జరుగుతుంది. గృహ, వాహన రుణాలకు ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా ఆర్థిక లాభం కలుగుతుంది. పిల్లలు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశివారికి చతుర్ధాధిపతి అయిన రవి ఇదే రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల గృహ, వాహన, ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. తండ్రి వైపు నుంచి ఇతరత్రా కూడా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వోద్యోగులకు ఆదాయం, పదోన్నతి వంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది. రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్ప డుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి లాభ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి రావడం జరుగుతుంది. ఆదాయానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలతో పాటు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
  4. సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి దశమ స్థాన సంచారం వల్ల కెరీర్ సంబంధమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. వృత్తి జీవితంలో స్తబ్ధత తొలగిపోయి, డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి, పలుకుబడి వృద్ధి చెందుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. వైవాహిక, దాంపత్య జీవితాల్లోని విభేదాలు, వివాదాలు పరిష్కారమయి, దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి.
  6. కుంభం: ఈ రాశివారికి సప్తమాధిపతి అయిన రవి, చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ సమ స్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు సానుకూలంగా సమసి పోతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభముం టుంది. ప్రభుత్వోద్యోగులకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు సిద్దిస్తాయి. ఉద్యోగులకు ప్రాధా న్యం, ప్రాభవం పెరుగుతాయి. గృహ, వాహన కొనుగోలుకు అవకాశాలు బాగా మెరుగవుతాయి.