AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Conjoined Twins: అరుదైన అవిభ‌క్త క‌వ‌ల‌ల జ‌న‌నం.. 20లక్షల మందిలో ఒకరు ఇలా..

1989లో చైనాలో కూడా ఇలాంటి కవలలు జన్మించారు. వారికి రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. వైద్యులు 1992లో వారికి శస్త్రచికిత్స చేసి ఇద్దరినీ వేరు చేశారు. అప్పటికీ వారి వయసు రెండేళ్లు మాత్రమే. ఆపరేషన్ దాదాపు 10 గంటలు పట్టింది. 2011లో పాకిస్థాన్‌లో కూడా ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పిల్లలలో ఒకరు

Conjoined Twins: అరుదైన అవిభ‌క్త క‌వ‌ల‌ల జ‌న‌నం.. 20లక్షల మందిలో ఒకరు ఇలా..
Conjoined Twins
Jyothi Gadda
|

Updated on: May 16, 2024 | 4:29 PM

Share

Spider Twins: ఇటీవల కాలంలో కవలలు పుట్టడం అనేది సర్వసాధారణమే. కానీ, ఇండోనేషియాలో మాత్రం అరుదైన అవిభక్త కవలులు జన్మించారు. ఆ ఇద్దరు నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒక జ‌న‌నాంగంతో కలిసి పుట్టారు. పిల్లలిద్దరూ కూర్చోలేని విధంగా ఉదర భాగం నుండి ఒకరికొకరు అతుక్కొని పుట్టారు. దీంతో వారు సరిగ్గా పడుకోలేరు, లేచి నిల్చోనూ లేరు. ఎటువెళ్లిన వారు సాలెపురుగు లాగా పాకుతు వెళ్లాల్సింది. ఇలాంటి అసాధారణమైన, అవిభక్త కవలలు 20 ల‌క్ష‌ల మందిలో ఒక‌రు ఇలా పుడుతార‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగ‌స్ ట్రిప‌స్ అని పిలుస్తారు. ఇలా పుట్ట‌డాన్ని స్పైడ‌ర్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. ఈ క‌వ‌ల‌ల గురించి తాజాగా అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్ర‌చురించారు.

నివేదిక ప్రకారం.. ఈ అవిభక్త కవలలు 2018లో జన్మించారు. వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి వారి మూడో కాలును తొలగించింది. తుంటి , కటి ఎముకలను సరిచేయడానికి సుదీర్ఘ ఆపరేషన్ జరిపారు. వైద్యుల ప్రకారం.. సాధారణంగా ప్రతి 50 వేల నుండి 2 లక్షల గర్భాలలో ఒక కవలలు పుడుతున్నారు. ఫలదీకరణం చేయబడిన గుడ్డు విడిపోయి రెండు భాగాలుగా అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. గర్భం దాల్చిన ఎనిమిది నుండి 12 రోజుల తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. రెండు వేర్వేరు పిండాలు ఒకే దగ్గర అభివృద్ధి చెందడం వల్ల ఇలాంటి కవలలు పుడతారని మరి కొన్ని పరిశోధనల్లో చెబుతున్నాయి.

అయితే, ఇండోనేషియాలో జన్మించిన ఇషియోఫాగ‌స్ ట్రిప‌స్ అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని స‌ర్జ‌రీ ద్వారా వేరు చేయ‌డం చాలా క‌ష్టం అని అంటున్నారు వైద్యులు. ఇలాంటి క‌వ‌ల‌ల్లో దిగువ శ‌రీర భాగం అతుక్కుని పుడుతారు. వీరిలో మొండాలు వేరుగా ఉంటాయి. దాదాపు 60 శాతం కేసుల్లో ఒక పిల్లాడు చ‌నిపోతుంటారు. కానీ, ఈ కేసులో ఆ సోద‌రులు ఇద్ద‌రూ బ్ర‌తికే ఉన్నారు. కానీ, వారు ప్రతినిత్యం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నారు. వారు మొద‌టి మూడు ఏళ్లు వాళ్లు ఫ్లాట్‌గా కింద‌నే నిద్ర‌పోయేవారు. బాడీ స్ట్ర‌క్చ‌ర్ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల వాళ్లు కూర్చునేవాళ్లు కాదు. అయితే ఓ స‌ర్జ‌రీ ద్వారా మూడ‌వ కాలును తీసివేశారు. దాంతో వాళ్ల తొడ‌లు, కాళ్ల‌కు బ‌లం వ‌చ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగ‌లుగుతున్నారు. కాలు స‌ర్జ‌రీ జ‌రిగిన మూడు నెల‌ల త‌ర్వాత కూడా వాళ్లు ఎటువంటి ఫిర్యాదులు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఇంకా ఆ క‌వ‌ల‌లు క‌లిసే ఉన్నారు. వాళ్ల‌ను వేరు చేసేందుకు ఏదైనా స‌ర్జ‌రీ చేస్తారా లేదా అన్న విష‌యాన్ని ఇంకా డాక్ట‌ర్లు నిర్ధారించ‌లేదు.

ఇవి కూడా చదవండి

1989లో చైనాలో కూడా ఇలాంటి కవలలు జన్మించారు. వారికి రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. వైద్యులు 1992లో వారికి శస్త్రచికిత్స చేసి ఇద్దరినీ వేరు చేశారు. అప్పటికీ వారి వయసు రెండేళ్లు మాత్రమే. ఆపరేషన్ దాదాపు 10 గంటలు పట్టింది. 2011లో పాకిస్థాన్‌లో కూడా ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పిల్లలలో ఒకరు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నారు. అలాగే ఒకరి తల చిన్నగా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..