Andhra Pradesh: తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె… ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం అర్దరాత్రి సమయంలో తన మేనల్లుడి సాయంతో రోశమ్మ ఉన్న ఇంటికి నిప్పు పెట్టింది. సకాలంలో మంటలను గమనించిన రోశమ్మ ఇద్దరు బిడ్డలను తీసుకుని ప్రమాదం నుండి బయటపడింది. అయితే నిప్పు పెడుతున్న విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు కావడంతో అసలు గుట్టు బయట పడింది.

Andhra Pradesh: తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె... ఏం జరిగిందంటే..
Fire
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: May 16, 2024 | 7:58 PM

తల్లి ఇంటికే నిప్పు పెట్టింది ఓ కుమార్తె. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసకుంది. సుజాత అనే మహిళ తన తల్లి ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టింది. భర్త నుండి విడిపోయిన సుజాత మరో వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే, అప్పటికే సుజాతకు తన మొదటి భర్తకు ఇద్దరు ఆడబిడ్డలున్నారు. వీడాకులు తీసుకున్న తర్వాత మరొక వ్యక్తితో సుజాత సహజీవనం చేస్తోంది. అయితే ఆమె ఇద్దరి బిడ్డలు సుజాత తల్లి వద్దే ఉంటున్నారు. తన బిడ్డలను తన వద్దకు పంపాలని అనేక సార్లు సుజాత తన తల్లి రోశమ్మతో గొడవ పడింది. అయితే అందుకు రోశమ్మ ఒప్పుకోలేదు. దీంతో తన తల్లిపైనే కక్ష పెంచుకుంది సుజాత. రెండు రోజుల క్రితం అర్దరాత్రి సమయంలో తన మేనల్లుడి సాయంతో రోశమ్మ ఉన్న ఇంటికి నిప్పు పెట్టింది. సకాలంలో మంటలను గమనించిన రోశమ్మ ఇద్దరు బిడ్డలను తీసుకుని ప్రమాదం నుండి బయటపడింది. అయితే నిప్పు పెడుతున్న విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు కావడంతో అసలు గుట్టు బయట పడింది.

తెనాలిలోని చెంచుపేటకు చెందిన రోశమ్మ ఒకరి ఇంట్లో పనిచేస్తూ జీవిస్తుంది. యజమాని స్థలంలోనే పూరిల్లు నిర్మించుకుని నివస్తుంది. ఆమె కుమార్తె సుజాత కూడా అక్కడకు దగ్గరలోనే భర్త నుండి విడిపోయి మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే రోశమ్మకు, సుజాతకు మధ్య విబేధాలున్నాయి. ఈ క్రమంలోనే తన మనమరాళ్లను తన వద్దే ఉంచుకుంటుంది. అయితే తన వద్దకు పంపాలని అనేక సార్లు సుజాత తల్లితో గొడవ పడింది. అందుకు రోశమ్మ ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తల్లిపైనే పగ పెంచుకుంది.

రెండు రోజుల క్రితం తన మేనల్లుడితో కలిసి అర్దరాత్రి రోశమ్మ నివిసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టింది. అయితే సకాలంలో గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాకుండా సుజాతతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అందరిని పోలీసులకు అప్పగించారు. ఇంటికి నిప్పు పెట్టిన విజువల్స్ సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!