AP Elections: గెలుపుపై జగన్ కాన్ఫిడెన్స్.. కూటమిలోనూ తగ్గని ధీమా!
ఎన్నికలకు ముందు ఒకలా... ఎన్నికలు ముగిశాక మరోలా.. అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయం. పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే.. పొలిటికల్‌గా నేతలు మాటలు మరోరకం చర్చకు కారణమవుతున్నాయి. ఐప్యాక్ టీమ్‌ను అభినందించిన జగన్ మరోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తే,.. పోలీసులపై మంత్రి అంబటి చేసిన కామెంట్స్ కొత్తరచ్చను క్రియేట్ చేశాయ్. ఇంతకీ విక్టరీపై సీఎం అంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి కారణమేంటి? ఖాకీలు నాలుగో కూటమి అంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక మతలబేంటి? ఆఫ్టర్ ఎలక్షన్ ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో అధికారం చేపట్టబోయేదెవరనే దానిపై రాజకీయంగా.. రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. పాలక, ప్రతిపక్షాలు.. దేనికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వేళ… ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, విజయవాడలోని ఐ ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్ కనిపించడం.. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఐ ప్యాక్ టీమ్‌ను అభినందించిన సీఎం.. మరోసారి మంచి మెజార్టీతో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు. తమకు సహకరించిన ఐ ప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపిన జగన్.. మరో ఐదేళ్లపాటు ప్రజలకు సుపరిపాలన అందించడంలో తోడ్పాటును అందించాలని కోరారు.
ఇక, ఇప్పటికే పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లతో.. రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ… మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమిలో చేరిన నాల్గో పార్ట్‌నర్‌లా.. ఎన్నికల రోజున పోలీసులు వ్యవహిరంచారంటూ ఆయన ట్విట్టర్ వేదిక చేసిన కామెంట్స్… పొలిటికల్‌గా రచ్చరేపుతున్నాయి.
ఓవైపు గెలుపు తమదేనంటూ కూటమి నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. కుటుంబసమేతంగా గుళ్లూ, గోపురాలు చుట్టేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా, సీఎం జగన్ చేసిన కామెంట్స్ .. స్టేట్ పాలిటిక్స్‌ని షేక్ చేస్తున్నాయి. మరోసారి మనమే అంటూ అధినేత ఇచ్చిన భరోసాతో..వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి, ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ధీమాలో ఎంత దమ్ముందన్నది తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..