AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోహిని ఏకాదశి రోజున ఏర్పడనున్న ప్రత్యేక యాదృచ్చికాలు.. ఈ చర్యలతో అన్ని పనులు పూర్తి

వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి మే 18, 2024న ఉదయం 11:23 గంటలకు ప్రారంభమై మే 19, 2024 మధ్యాహ్నం 01:50 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయతిథి ఆధారంగా మే 19వ తేదీ ఆదివారం రోజున మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం ఈసారి మోహినీ ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు పవిత్ర యాదృచ్చికాలను పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరి, ఇంట్లో సుఖ, సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.

మోహిని ఏకాదశి రోజున ఏర్పడనున్న ప్రత్యేక యాదృచ్చికాలు.. ఈ చర్యలతో అన్ని పనులు పూర్తి
Mohini Ekadashi 2024
Surya Kala
|

Updated on: May 16, 2024 | 2:31 PM

Share

హిందూ మతంలో ఏకాదశి తిధి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున శ్రీ హరికి ప్రత్యేక పూజలు చేస్తారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణువు తో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తుడు సుఖ సంతోషాలను పొందుతాడు.

తేదీ, శుభ సమయం:

వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి మే 18, 2024న ఉదయం 11:23 గంటలకు ప్రారంభమై మే 19, 2024 మధ్యాహ్నం 01:50 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయతిథి ఆధారంగా మే 19వ తేదీ ఆదివారం రోజున మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

పంచాంగం ప్రకారం ఈసారి మోహినీ ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు పవిత్ర యాదృచ్చికాలను పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరి, ఇంట్లో సుఖ, సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు జ్యోతిషశాస్త్ర కోణంలో చూస్తే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేక యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి

  1. అమృత యోగం: ఇది మే 19, ఆదివారం ఉదయం 05:28 నుంచి మే 20, సోమవారం ఉదయం 03:16 వరకు ఉంటుంది.
  2. వజ్ర యోగం: మే 18, శనివారం ఉదయం 10:25 నుండి మే 19 ఆదివారం ఉదయం 11:25 వరకు
  3. సిద్ధి యోగం: ఇది మే 18వ తేదీ శనివారం ఉదయం 11:25 నుండి మే 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:11 గంటల వరకు ఉంటుంది.
  4. ఈ యోగాలలో మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, విష్ణువును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.

ఏకాదశి రోజున చేయాల్సిన ప్రత్యేక చర్యలు ఏమిటంటే

  1. మోహినీ ఏకాదశి రోజున ఏదైనా ప్రత్యేక కోరికను నెరవేర్చడానికి కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని, దాని నాలుగు అంచులకు కుంకుమ అద్ది శ్రీ హరి ఆలయానికి వెళ్లి దానిని సమర్పించి మీ కోరికను తీర్చమని కోరుకోండి.
  2. జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే మోహినీ ఏకాదశి రోజున నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి, ధూపం, దీపాలు మొదలైన వాటితో విష్ణువును పూజించి, భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి.
  3. జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఈ ఏకాదశి రోజున శ్రీ విష్ణువును నిర్దేశించిన పద్ధతిలో పూజించిన తర్వాత, శ్రీ విష్ణు గాయత్రీ మంత్రాన్ని జపించండి. శ్రీ విష్ణు గాయత్రీ మంత్రం ‘ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.’
  4. వ్యాపారంలో పురోగతి సాధించాలనుకుంటే ఇంటికి ఒక బ్రాహ్మణుడిని గౌరవంగా ఆహ్వానించి, అతనికి కడుపునిండా భోజనం పెట్టండి. మీ శక్తి మేరకు తాంబూలం దక్షిణ కూడా ఇవ్వండి. బ్రాహ్మణుడు స్వయంగా ఇంటికి రాలేకపోతే ఒక ప్లేట్‌లో ఆహారాన్ని పక్కకు పెట్టండి. అతని ఇంటికి వెళ్లి అతని పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇవ్వండి.
  5. కెరీర్‌లో విజయాన్ని పొందడానికి, విష్ణువుకు వెన్న ,పంచదార మిఠాయిని సమర్పించి, విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని, ‘ఓం నమో భగవతే నారాయణ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?
పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం