గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేయడం వలన ఉత్తమ గతులు లభిస్తాయి.. అవి ఏమిటంటే

గరుడ పురాణం ప్రపంచ పోషకుడైన శ్రీ మహా విష్ణువు గురించి మాత్రమే కాదు.. మానవులు చేసే కర్మలు.. వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. గరుడ పురాణం అంటే చెడు పనులు.. నరకం శిక్షల గురించి తెలియజేసేది మాత్రమే కాదు.. మానవుడు చేసే మంచి పనులు.. దానధర్మాలు వాటి వలన కలిగే ఉత్తమ ఫలితాలు గురించి కూడా పేర్కొంది. అంటే ఇహ లోకంలో చేసే పుణ్య కార్యం.. పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా మనవ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసే దానానికి విశిష్ట ఫలితం దక్కుతుందని తెలుపుతుంది గరుడపురాణం

గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేయడం వలన ఉత్తమ గతులు లభిస్తాయి.. అవి ఏమిటంటే
Garuda Puranam
Follow us

|

Updated on: May 10, 2024 | 12:09 PM

హిందూ సనాతన ధర్మంలో రామాయణ, మహాభారత గ్రంథాలతో పాటు వేదాలు, పురాణాలకు విశిష్ట స్థానం ఉంది. మన ప్రాచీన సనాతన హిందూధర్మ ఆచరణ విధానాలను, విశిష్టతలను చాటి చెప్పిన ఈ గ్రంథాలు మానవుడు ఏ విధంగా జీవించాలి.. ఎలా జీవించ కూడదో పేర్కొన్నాయి. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణం ప్రపంచ పోషకుడైన శ్రీ మహా విష్ణువు గురించి మాత్రమే కాదు.. మానవులు చేసే కర్మలు.. వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. గరుడ పురాణం అంటే చెడు పనులు.. నరకం శిక్షల గురించి తెలియజేసేది మాత్రమే కాదు.. మానవుడు చేసే మంచి పనులు.. దానధర్మాలు వాటి వలన కలిగే ఉత్తమ ఫలితాలు గురించి కూడా పేర్కొంది. అంటే ఇహ లోకంలో చేసే పుణ్య కార్యం.. పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా మనవ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసే దానానికి విశిష్ట ఫలితం దక్కుతుందని తెలుపుతుంది గరుడపురాణం

 1. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి కైలాసప్రాప్తి లభిస్తుంది.
 2. గోవును దానం చేస్తే గోలోకంలో చోటు లభిస్తుంది. అదే ఆవు దూడను దానం చేసిన వారికీ శ్రీహరి నివాసం వైకుంఠవాసం లభిస్తుంది.
 3. ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన వారికి తమకు నచ్చిన లోకంలో నివసిస్తారు.
 4. గొడుగు దానంచేసినవారు 1000 ఏళ్లు వరుణలోకంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారు.
 5. ఇవి కూడా చదవండి
 6. రాగి, నెయ్యి, మంచం, చాప, దిండు వంటి వాటిని దానం చేసిన వారికి సత్యలోకంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారు.
 7. వస్త్ర దానం చేసినవారికి వాయులోకంలో వెయ్యి ఏళ్లు జీవిస్తారు.
 8. రక్తం, అవయవాలు దానం చేసినవారు అగ్నిలోకంలో ఆనందంగా వుంటారు.
 9. ధాన్యం, నవరత్నాలను దానం చేసిన వారికి మరు జన్మ లభిస్తుంది. మేధావిగా దీర్ఘాయుస్సుతో జీవిస్తారు.
 10. సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళతారు.
 11. ఎవరైనా యువతికి చదువు నేర్పించినా, పెళ్లి చేసినా స్వర్గ లోకంలో చోటు దక్కుతుంది.
 12. బంగారం, వెండి దానం చేసిన వారికి కుబేరలోకంలో నివాసం లభిస్తుంది.
 13. అవసరం అయిన వారికి ధన సహాయం చేస్తే శ్వేత దీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది.
 14. చెట్లను, వృక్షాలు నాటి పెంచిన వారికి తపో లోకంలో చోటు దక్కుతుంది.
 15. ఆలయాల నిర్మాణానికి దానం చేసిన వారికి 64 ఏళ్లు పరమపదంలో నివసించే అవకశం ఉంది.
 16. దేవుడు ఊరేగిం వీధులను శుభ్రపరిచేవారికి 10000 ఏళ్లు ఇంద్రలోకంలో జీవిస్తారు.
 17. రుచిగల పండ్లను, ఫలాలు దానం చేస్తే గంధర్వలోకంలో నివసిస్తారు.
 18. సూర్యోదయ సమయంలో గంగలో స్నానం చేసినవారికి 60000 సంవత్సరాలు పరమపదంలో వుంటారు.
 19. సుదర్శనహోమం, ధన్వంతరిహోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రువు భయం లేకుండా దీర్ఘాయుస్సుతో జీవిస్తారు.
 20. గరుడపురాణం చదివే వారు, వినే వారికి అంతిమకాలంలో స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది. వారి తల్లి తండ్రులు, పితామహులకు ముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles