శ్రీశైలం హుండీ కౌంటింగ్ పూర్తి.. మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల ఆదాయం

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 212 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారం అలాగే వెండి 3 కేజీల 770 గ్రాములు భక్తులు సమర్పించారు. నగదు బంగారుతో పాటు 644 యుఎస్ఏ డాలర్లు, 56 మలేషియా రియాల్, 149 సౌది అరేబియా రియాల్స్,715- యూకే పౌండ్స్, 20 యురోస్, 12 సింగపూర్ డాలర్లు, 20 కెనడ డాలర్లు,60 ఆస్ట్రేలియ డాలర్లు,115 యుఏఈ దిర్హమ్స్,17 ఖత్తార్ రియాల్, 20 థాయ్లా ల్యాండ్భత్ మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయి.

శ్రీశైలం హుండీ కౌంటింగ్ పూర్తి.. మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల ఆదాయం
Srisailam Hundi Counting
Follow us

| Edited By: Surya Kala

Updated on: May 10, 2024 | 11:33 AM

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ గిరికి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయం సిబ్బంది. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు జరిపారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల 81 లక్షల 51 వేల 743 రూపాయల నగదు కానుకలుగా లభించినట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులులో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 212 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారం అలాగే వెండి 3 కేజీల 770 గ్రాములు భక్తులు సమర్పించారు. నగదు బంగారుతో పాటు 644 యుఎస్ఏ డాలర్లు, 56 మలేషియా రియాల్, 149 సౌది అరేబియా రియాల్స్,715- యూకే పౌండ్స్, 20 యురోస్, 12 సింగపూర్ డాలర్లు, 20 కెనడ డాలర్లు,60 ఆస్ట్రేలియ డాలర్లు,115 యుఏఈ దిర్హమ్స్,17 ఖత్తార్ రియాల్, 20 థాయ్లా ల్యాండ్భత్ మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles