తెరచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. ఈ యాత్రకు మొదటి సారి వెళ్తున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడున్న కేదారేశ్వరుడిని దర్శనం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఎవరైనా మొదటి సరిగా కేదార్‌నాథ్‌కు వెళ్తున్నట్లు అయితే తప్పని సరిగా ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజు కేదార్‌నాథ్ కు వెళ్ళే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

తెరచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. ఈ యాత్రకు మొదటి సారి వెళ్తున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే
Kedarnath Yatra Doors Open
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2024 | 10:07 AM

అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో పాటు యమునోత్రి, గంగోత్రి యాత్ర కూడా ప్రారంభమైంది. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. భక్తీ విశ్వాసంతో పాటు, ఇక్కడ ప్రకృతి అందాల అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడున్న కేదారేశ్వరుడిని దర్శనం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఎవరైనా మొదటి సరిగా కేదార్‌నాథ్‌కు వెళ్తున్నట్లు అయితే తప్పని సరిగా ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజు కేదార్‌నాథ్ కు వెళ్ళే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

కేదార్నాథ్ చేరుకోవడం ఎలా అంటే

కేదార్‌నాథ్ యాత్ర వాస్తవానికి హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి మొదలవుతుంది. రైలులో హరిద్వార్ చేరుకోవచ్చు. అక్కడ నుంచి మరింత ముందుకు వెళ్ళడానికి టాక్సీని బుక్ చేసుకోవచ్చు లేదా బస్సులో కూడా వెళ్ళవచ్చు. హరిద్వార్ నుంచి సోనప్రయాగ 235 కిలోమీటర్ల దూరంలో ఉండగా, గౌరీకుండ్.. సోన్‌ప్రయాగ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, టాక్సీ లేదా బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

దీన్ని దాటి 16 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు విమాన సేవ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఈ సేవలు బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్‌సైట్ నుండి టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. చార్ ధామ్ యాత్ర కోసం వెళుతున్నట్లయితే, ఖచ్చితంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు చేసుకోవడానికి, ఈ లింక్‌పై క్లిక్ చేయండి- https://registrationandtouristcare.uk.gov.in/signin.php

ఇవి కూడా చదవండి

5 నుంచి 6 రోజుల సమయం

కేదార్‌నాథ్ వెళుతున్నట్లయితే కనీసం 5 నుండి 6 రోజుల సమయం తీసుకోండి. దారిలో అనేక హోటళ్ళు, ధర్మశాలలు లేదా అతిథి గృహాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటన్నింటినీ ముందుగానే బుక్ చేసుకోండి. కేదార్‌నాథ్‌లో ఉండేందుకు ప్రత్యేక సదుపాయాలు లేవు. అటువంటి పరిస్థితిలో మార్గంలో అడపాదడపా ప్రయాణించడానికి ప్రయత్నించండి.

ఏ విషయాలు గుర్తుంచుకోవాలంటే

  1. తీసుకుని వెళ్ళాల్సిన వస్తువులు – కేదార్‌నాథ్‌కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చ్, అదనపు బ్యాటరీ, మొబైల్ ఛార్జర్, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, వాటర్ బాటిల్‌ను మీతో ఉంచుకోవాలి. ఇది కాకుండా, చల్లని బట్టలు, రెయిన్ కోట్ కూడా ఉంచుకోండి.
  2. వాతావరణాన్ని తెలుసుకోవడం ముఖ్యం – కేదార్‌నాథ్ హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాలలో ఉంది. దీని కారణంగా ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది. అందువల్ల, ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వాతావరణాన్ని తనిఖీ చేయండి.
  3. నగదు ఉంచుకోండి- ఇక్కడకు వెళ్ళే ముందు ఖచ్చితంగా మీ వద్ద నగదు ఉంచుకోండి. కొన్నిసార్లు ఇక్కడ ఏటీఎంలు పని చేయకపోగా, కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడం కష్టంగా మారుతుంది.
  4. ఇవి మాత్రమే కాదు ఎవరైనా మధుమేహం లేదా రక్తపోటు రోగి అయితే డాక్టర్ సలహా మేరకు అదనపు మందులను ఉంచుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు