AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya: నేడు ఏర్పడనున్న ఐదు శుభ యోగాలు.. ఈ రోజు బంగారంతో పాటు వీటిని కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

మత విశ్వాసం ప్రకారం, ప్రజలు ఈ 5 పవిత్రమైన యాదృచ్చికాల్లో అక్షయ తృతీయ రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. అంతేకాదు ఈ రోజు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు. అనేక ఫలితాలను పొందవచ్చు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, కుబేర యంత్రం, భూమి, శ్రీ యంత్రం, మట్టి కుండ, వాహనాలు, గవ్వలు, కొబ్బరి కాయ, స్పటిక తాబేలు, శివలింగం లేదా దక్షిణావర్తి శంఖం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఇలాంటివి కొనుగోలు చేయడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని .. అమ్మ అనుగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు ఉండవని విశ్వాసం.

Akshaya Tritiya: నేడు ఏర్పడనున్న ఐదు శుభ యోగాలు.. ఈ రోజు బంగారంతో పాటు వీటిని కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
Gold Purchase
Surya Kala
|

Updated on: May 10, 2024 | 7:16 AM

Share

ఈ రోజు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అక్షయ తృతీయ తిధి. ఈ రోజున కొన్ని గ్రహాల కదలికలతో శుభాయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రోజు వృషభరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడనుంది. అదే సమయంలో కుజుడు, బుధుడు కలయిక వల్ల ధనయోగం, మేషరాశిలో సూర్యుడు, శుక్రుడు కలయికతో ల్ల శుక్రాదిత్య యోగం, కుంభరాశిలో శని ఉండడంతో శని యోగం ఏర్పడుతుంది. మీనరాశిలో కుజుడు ఉండటం వల్ల మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతుంది. మత విశ్వాసం ప్రకారం, ప్రజలు ఈ 5 పవిత్రమైన యాదృచ్చికాల్లో అక్షయ తృతీయ రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. అంతేకాదు ఈ రోజు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు. అనేక ఫలితాలను పొందవచ్చు.

అక్షయ తృతీయ రోజున బంగారంతో పాటు ఏమి కొనవచ్చు అంటే..

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, కుబేర యంత్రం, భూమి, శ్రీ యంత్రం, మట్టి కుండ, వాహనాలు, గవ్వలు, కొబ్బరి కాయ, స్పటిక తాబేలు, శివలింగం లేదా దక్షిణావర్తి శంఖం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఇలాంటివి కొనుగోలు చేయడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని .. అమ్మ అనుగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు ఉండవని విశ్వాసం.

అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొనాలి?

బంగారం తరగని లోహం, అంటే ఎప్పటికీ నాశనం కాని లోహం. వేదాలలో బంగారం దైవంగా.. అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణించబడుతుంది. బంగారం బృహస్పతి లోహం .. లక్ష్మీదేవికి చిహ్నం. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. దీంతో పాటు దాంపత్య జీవితంలో ఆనందాన్ని కలిగించే జాతకంలో బృహస్పతి బలవంతుడై డబ్బుకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

అక్షయ తృతీయ నాడు ఏ పని చేయవచ్చు?

  1. అక్షయ తృతీయ రోజు పవిత్ర నదీ స్నానం, శ్రాద్ధ కర్మలు, బ్రాహ్మణలకు భోజనం, యాగం, దానధర్మాలు మొదలైనవి చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నాయి.
  2. అక్షయ తృతీయ లక్ష్మీ నారాయణుని, కుబేరుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది .
  3. అక్షయ తృతీయ నాడు బంగారం-వెండి, బట్టలు, పాత్రలు, యంత్రాలు, భూమి-భవనాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది.
  4. అక్షయ తృతీయ నాడు తర్పణం ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెందుతుంది.
  5. ఈ రోజున కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
  6. అక్షయ తృతీయ రోజున రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

అక్షయ తృతీయ నాడు ఏమి కొనకూడదు?

అక్షయ తృతీయ నాడు సిరామిక్ పాత్రలు, ప్లాస్టిక్, ఇనుము వంటి లోహ వస్తువులు, నల్లని దుస్తులు, ముళ్ల మొక్కలు కొనకూడదు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు