Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 10, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 13th May 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 10, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 10, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం సవ్యంగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బిజీ అయిపోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశముంది. అధికారుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులుండ వచ్చు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలు సత్ఫ లితాలనిస్తాయి. పిల్లలు చదువుల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. కొందరు మిత్రుల కారణంగా కొద్దిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ సంచారం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగు దల ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అను కూలతలు బాగా పెరుగుతాయి. స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ శక్తి సామర్థ్యాలు బాగా ఉపయోగపడతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వ్యక్తిగత సమ స్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కుటుంబంతో కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడ తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన స్థాయిలో లబ్ధి పొందుతారు. రోజంతా బాగా ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగ స్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభకార్యానికి హాజరవుతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విలాసాల మీదా, విందు వినోదాల మీదా ఖర్చు బాగా పెరు గుతుంది. తలపెట్టిన పనులన్నిటినీ వేగంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు బంధువుల వల్ల ఇరకాటంలో పడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు బాగా ఉపయోగపడతాయి. ఒకటి రెండు సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. అనుకోకుండా మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులు గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభ వార్త వింటారు. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒకటి రెండు సమస్యల్ని చక్కబెడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా మార్పులు జరుగుతాయి. అధికారుల ఆదరణ బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి కానీ, మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సామరస్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సంతృప్తి కరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. కొందరు స్నేహి తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిం చడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

Latest Articles
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..