AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య చెప్పిన ఈ 5 విషయాలు పాటిస్తే కష్టాలు తొలగి చదువులో విజయం మీ సొంతం

తమ కష్టానికి తగ్గట్టుగా విజయం అందుకోని వ్యక్తులు నిరాశ నిసృహలకు లోనవుతారు. దీంతో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది కూడా ..  మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని విషయాలను అనుసరించండి. విజయాన్ని అందుకోవాలంటే ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 5 పనులు చేయాలని చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. 

చాణక్య చెప్పిన ఈ 5 విషయాలు పాటిస్తే కష్టాలు తొలగి చదువులో విజయం మీ సొంతం
Chanakya Niti
Surya Kala
|

Updated on: May 09, 2024 | 11:45 AM

Share

ఏ కాలం అయినా సరే ప్రతి వ్యక్తి విజయాన్ని కోరుకుంటాడు. అందుకు తగిన ప్రయత్నాలు చేస్తాడు. అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. కొంత మంది మాత్రమే విజయం సాధించగలుగుతారు. తమ కష్టానికి తగ్గట్టుగా విజయం అందుకోని వ్యక్తులు నిరాశ నిసృహలకు లోనవుతారు. దీంతో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది కూడా ..  మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని విషయాలను అనుసరించండి. విజయాన్ని అందుకోవాలంటే ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 5 పనులు చేయాలని చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

  1. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే ఎవరైనా సరే  చేయవలసిన మొదటి పని రోజులో చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవడం. ఇలా చేయడం వలన సమయం అదావుతుంది. ఖచ్చిత సమయంలో పని చేయడంలో విజయం సాధించగలరు. ఏ పనినైనా సమయపాలన లేకుండా చేస్తే లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. అంతేకాదు పిల్లల చదువుల కోసం కూడా ప్రణాళిక వేయాలి. దీంతో పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు చదువులోనూ విజయం సాధిస్తారు.
  2. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ప్రజలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కనుక సమయానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరైనా సరే ఆరోగ్యంతో బాధపడకూడదు.  దీని కోసం దినచర్యను ముగించిన తర్వాత ఉదయం వ్యాయామం చేయండి.
  3. కెరీర్, వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం, ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యానికి, వృత్తికి మంచిది కాదని ఆచార్య చాణక్య చెప్పారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అదే సమయంలో సమయాన్ని పాటించకపోవడం, పని లేకపోవడం వల్ల వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధించలేడు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి.
  4. పిల్లలు తమ కెరీర్‌లో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. అలాగే లక్షాలను  ఉన్నతంగా ఉంచుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ కష్టంతో ఏదో ఒకరోజు కచ్చితంగా సక్సెస్ ఫుల్ మనిషి అవుతానని మీకు మీరే చెప్పుకోండి. ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.  ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. ఎటువంటి కష్టమైన పనిని చేయాలన్నా వెనుకంజ వేయవద్దు.
  5. పిల్లలు, పెద్దలు ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ భగవంతుడిని స్మరించుకోవాలి. ఈ సమయంలో ‘కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతి. కరమూలే స్థితో బ్రహ్మా ప్రభాతే కరదర్శనమ్ ॥ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు. పిల్లలు కూడా చదువులపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. పిల్లలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చదువులో ఇబ్బందులను సులభంగా ఎదుర్కోగలుగుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు