AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాండవులు కలియుగంలో జన్మించాలని శపించిన శివుడు? వారి పేర్లు ఏమిటో తెలుసుకోండి

పాండవులు నిద్రిస్తున్న సమయంలో తమ కుమారులను ఎవరో చంపారని తెలుసుకున్న పాండవులు, అజ్ఞానంతో శివుడిని దోషిగా భావించి  శివునిపై యుద్ధానికి బయలుదేరారు. పాండవులు, శివుడు ముఖాముఖి తలపడినప్పుడు పాండవులు యుద్ధానికి సిద్దమై శివునిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు.. వారి ఆయుధాలన్నీ శివునిలో కలిసిపోయాయి. తనపై ఆయుధాలు ఎత్తిన పాండవులపై కోపోద్రిక్తుడైన శివుడు మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని భక్తులు కనుక మీరు చేసిన పైకి శిక్షను కలియుగంలో పొందుతారు అని శపించాడట.

పాండవులు కలియుగంలో జన్మించాలని శపించిన శివుడు? వారి పేర్లు ఏమిటో తెలుసుకోండి
Pandavas In Kaliyug
Surya Kala
|

Updated on: May 09, 2024 | 12:38 PM

Share

భవిష్య పురాణం ప్రకారం మహాభారతంలో (కురుక్షేత్ర) యుద్ధ సమయంలో అర్ధరాత్రి, గురు ద్రోణాచార్యుల కుమారులు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య పాండవుల శిబిరం దగ్గరకు వెళ్లి మనస్సులో శివుడిని పూజించడం ప్రారంభించారు. తనను అత్యంత భక్తి శ్రద్దలతో పూజించినందుకు సంతోషించిన శివుడు ఈ ముగ్గురిని పాండవుల శిబిరంలోకి అనుమతించాడు. దీని తరువాత అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి.. శివుని నుంచి వరం పొందిన ఆయుధంతో పాండవులు అనుకుని ఉప పాండవులైన వారందరినీ  నిద్రలోనే చంపి, నిశ్శబ్దంగా ఆ శిబిరం నుంచి బయటకు వచ్చాడు.

పాండవులను శపించిన శివుడు

పాండవులు నిద్రిస్తున్న సమయంలో తమ కుమారులను ఎవరో చంపారని తెలుసుకున్న పాండవులు, అజ్ఞానంతో శివుడిని దోషిగా భావించి  శివునిపై యుద్ధానికి బయలుదేరారు. పాండవులు, శివుడు ముఖాముఖి తలపడినప్పుడు పాండవులు యుద్ధానికి సిద్దమై శివునిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు.. వారి ఆయుధాలన్నీ శివునిలో కలిసిపోయాయి. తనపై ఆయుధాలు ఎత్తిన పాండవులపై కోపోద్రిక్తుడైన శివుడు మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని భక్తులు కనుక మీరు చేసిన పైకి శిక్షను కలియుగంలో పొందుతారు అని శపించాడట.

పాండవులు చేసిన నేరానికి తగిన ఫలితాన్ని ఈ జన్మలో పొందలేరు. అందుకు కలియుగమే వేదిక. మీరు కలియుగంలో మళ్లీ జన్మించి ఇప్పటి నేరానికి వచ్చిన పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. శివుడు శాపం ఇచ్చిన తరువాత పాండవులందరూ శ్రీకృష్ణుడిని చేరుకున్నారు, అప్పుడు శ్రీ కృష్ణుడు కలియుగంలో పాండవులందరూ ఎక్కడ , ఎవరి ఇంట్లో ఎలా పుడతారో వారికి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో ఎవరు ఎక్కడ జన్మించారో తెలుసా

  1. కలియుగంలో అర్జునుడు పారిలోక అనే రాజు ఇంట్లో జన్మించాడు. అప్పుడు అతని పేరు బ్రహ్మానందుడు. గొప్ప శివ భక్తుడు.
  2. ధర్మరాజు యుధిష్ఠిరుడు వత్సరాజు అనే రాజుకు కుమారుడిగా జన్మించాడు. అప్పుడు అతని పేరు బాల్ఖానీ (మల్ఖాన్).
  3. కలియుగంలో భీముని పేరు వీరన్. అతను వానరస్ అనే రాజ్యానికి రాజు అయ్యాడు.
  4. కన్యాకుబ్జ రాజు రత్నభానుడికి నకులుడు జన్మించాడు. అప్పుడు అతని పేరు లక్ష్మణుడు.
  5. కలియుగంలో సహదేవుడు భీంసింగ్ అనే రాజు ఇంటిలో జన్మించాడు. అప్పుడు అతని పేరు దేవసింగ్.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు