అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం మీ సొంతం

అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా కోరిన కోరికల నెరవేర్చుకునేందుకు, విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. 

అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం మీ సొంతం
Goddess Laxmi Devi
Follow us

|

Updated on: May 09, 2024 | 10:34 AM

హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ అదృష్టం, శ్రేయస్సు, కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంధాలలో  అక్షయ తృతీయను అబుజ్హ ముహూర్తంగా వర్ణించారు. అంటే ఈ రోజున ఏదైనా శుభ కార్యం చేయాలన్నా  ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. అంతేకాదు ఈ రోజున కొన్ని మంత్రాలను పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రాలను పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

అక్షయ తృతీయ రోజున చేసే జపం, దానం, స్నానం, పూజల ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా కోరిన కోరికల నెరవేర్చుకునేందుకు, విజయం కోసం కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించవచ్చు. సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం.

ఈ మంత్రాలను జపించండి

ఓం నమో నారాయణాయ నమః – ఈ మంత్రం విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని జపించుట వలన సుఖము, శ్రేయస్సు, మోక్షము కలుగును.

ఇవి కూడా చదవండి

ఓం గం గణపతయే నమః – ఈ మంత్రం గణేశుడికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వల్ల ఆటంకాలు నశించి, పనిలో విజయం చేకూరుతుంది.

ఓం మహాలక్ష్మి నమో నమః ఓం విష్ణు ప్రియయే నమో నమః – ఈ మంత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దీనిని జపించడం వలన సిరి సంపదలు లభిస్తాయి.

ఓం శ్రీ గురుదేవాయ నమః – ఈ మంత్రం గురువుకు అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, తెలివి, మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్: -ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాలు కాకుండా.. మీకు నచ్చిన ఏదైనా మంత్రాన్ని కూడా  జపించవచ్చు. మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండాలని గుర్తుంచుకోండి. అక్షయ తృతీయ రోజున దానం, స్నానం, పూజ, మంత్రోచ్ఛారణలతో పాటు కొత్త వ్యాపారం, కొత్త ఇల్లు కొనడం, కొత్త వాహనం కొనడం, చదువు ప్రారంభించడం, పెళ్లి చేసుకోవడం వంటి శుభకార్యాలు కూడా చేయవచ్చు. ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అక్షయ తృతీయ రోజున ఈ పనులు చేయడం వల్ల విజయం, స్థిరత్వం లభిస్తుందని.. ఎటువంటి సమస్యలు తలెత్తవని నమ్మకం.

అక్షయ తృతీయ మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవి ఈ మంత్రాలను పఠించడం ద్వారా ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంపదకు ఆటంకం కలిగించే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది.  అమ్మవారి అనుగ్రహంతో ఇంటి కష్టాలు, దారిద్య్రం తొలగిపోతుంది. అంతేగాదు ఇంట్లోని డబ్బులకు లోటు ఉండదు. ఆర్ధిక అభివృద్ధి కోసం కొత్త వనరులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉదయం, సాయంత్రం ఈ మంత్రాలను పఠించడం శ్రేయస్కరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..
వందే భారత్ స్లీపర్​ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు
వందే భారత్ స్లీపర్​ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు