Fish Spa: ఫిష్ స్పాకి వెళ్తున్నారా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

ఈ స్పాను ఫిష్ పెడిక్యూర్ అని కూడా పిలుస్తారు. ఈ స్పా చేయించుకున్నవారు మానసికంగా రిలాక్స్ అవుతారు. పాదాలకు కూడా సహజమైన మెరుపు వస్తుంది. అయితే ఫిష్ స్పా చేయించుకున్న వారి వల్ల మీకు కొంత తీవ్రమైన హాని కూడా కలుగుతుందని మీకు తెలుసా..! ఈ రోజు ఫిష్ స్పా వలన జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం.. 

Fish Spa: ఫిష్ స్పాకి వెళ్తున్నారా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Fish Spa
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2024 | 9:37 AM

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. దీని కోసం చాలా మంది ప్రతి రోజూ ముఖం నుంచి పాదాల వరకు వివిధ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు మార్కెట్‌లో ఎన్నో రకాల ట్రీట్‌మెంట్‌లు వచ్చినట్లే, పాదాలను అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఫేస్, హెయిర్ స్పా గురించి వినే ఉంటారు. అయితే ప్రస్తుతం ఫిష్ స్పా కూడా మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫిష్ స్పా ను మాల్స్  నుంచి హెయిర్ పార్లర్ వరకు ప్రతిచోటా ఉన్నాయి.

ఈ స్పాను ఫిష్ పెడిక్యూర్ అని కూడా పిలుస్తారు. ఈ స్పా చేయించుకున్నవారు మానసికంగా రిలాక్స్ అవుతారు. పాదాలకు కూడా సహజమైన మెరుపు వస్తుంది. అయితే ఫిష్ స్పా చేయించుకున్న వారి వల్ల మీకు కొంత తీవ్రమైన హాని కూడా కలుగుతుందని మీకు తెలుసా..! ఈ రోజు ఫిష్ స్పా వలన జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం..

ఫిష్ స్పా అంటే ఏమిటి?

తమ పాదాలను అందంగా మార్చుకోవడానికి ఫిష్ స్పా చేయించుకుంటున్నారు. నిజానికి ఫిష్ స్పా అనేది పాదాల చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చేందుకు చేసే ఒక రకమైన బ్యూటీ ట్రీట్‌మెంట్. ఈ స్పాలో  పాదాలను నీటితో నిండిన ట్యాంక్‌లో పెడతారు. ఈ ట్యాంక్‌లో చాలా చిన్న చేపలు ఉంటాయి. ఈ చేపలు  పాదాలలో ఉండే మృతకణాలను తింటాయని చెబుతారు. అయితే ఫిష్ స్పా చేయించుకోవడం వల్ల  ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా..! ఫిష్ స్పా చేయించుకోవడం వలన అనేక రకాల తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.

ఇవి కూడా చదవండి

వ్యాధుల ప్రమాదం: ఫిష్ పెడిక్యూర్ చేయించుకుంటే సోరియాసిస్, ఎగ్జిమా వంటి తీవ్రమైన వ్యాధులను పొందవచ్చు. ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తిని కొరికిన తర్వాత చేపలు మిమ్మల్ని కొరికితే.. ఈ వ్యాధులు సోకే  ప్రమాదం పెరుగుతుంది.

స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం: ఫిష్ స్పా చేయించుకున్న వారికి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. ట్యాంక్‌లో ఉన్న చేపలను ప్రతిరోజూ శుభ్రం చేస్తారు. దీంతో ట్యాంక్‌లో రకరకాల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. పాదాలకు గాయాలు లేదా పగుళ్లు ఉంటె ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి స్కిన్  ఇన్ఫెక్షన్‌ని కలిగిస్తుంది.

గోర్లు పాడవుతాయి: ఫిష్ స్పా చేయించుకునే సమయంలో బొటనవేళ్లు, కాలి గోర్లు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ట్యాంక్‌లో ఉండే చేపలు గోళ్లను కొరుకుతాయి. దీని కారణంగా గోర్లు దెబ్బతింటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..