AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaisakha Masam: నేటి నుంచి వైశాఖ మాసం మొదలు.. ఈ నెలలో వీటిని దానం చేయడం వలన విశేష ఫలితాలు మీ సొంతం..

వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో ఉత్తమగతులు లభిస్తాయి. ఉదయం రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది.. పూర్వీకులంతా తరిస్తారని విశ్వాసం. ఈ మాసంలో శివునికి అభిషేకం చేయడం శుభఫలితాలనిస్తుంది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.

Vaisakha Masam: నేటి నుంచి వైశాఖ మాసం మొదలు.. ఈ నెలలో వీటిని దానం చేయడం వలన విశేష ఫలితాలు మీ సొంతం..
Vaisakha Masam
Surya Kala
|

Updated on: May 09, 2024 | 6:41 AM

Share

తెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుంది. తెలుగు నెలల్లో రెండో నెల వైశాఖ మాసం లో చేసే దానాలకు విశేష పుణ్య ఫలం ఉంది. ఈ మాసానికి మరో పేరు మాధవ మాసం. వైశాఖ మాసం శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైంది. ఈ నెలలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం. వేసవి తాపం అధికంగా ఉండే ఈ మాసం లో ఏక భుక్తం ఉత్తమమని పెద్దలు చెబుతారు. వైశాఖ మాసంలో చేసే యజ్ఞ, యాగాలు, దానధర్మాలకు విశిష్ట ఫలం లభిస్తుంది. కోరిన కోరికలు తీరతాయని విశ్వాసం.

వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో ఉత్తమగతులు లభిస్తాయి. ఉదయం రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది.. పూర్వీకులంతా తరిస్తారని విశ్వాసం. ఈ మాసంలో శివునికి అభిషేకం చేయడం శుభఫలితాలనిస్తుంది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.

వైశాఖమాస మాహత్యం

ఈ వైశాఖమాస మాహత్యాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీమహాల క్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈ నెలలో ప్రతి రోజూ పుణ్యదినమే. ఈ మాసంలో చేయాల్సిన పూజలు, దానాల గురించి  పురాణగ్రంధాల్లో వివరించారు. ఈ నెలలో చేసే స్నానం, పూజ , దానధర్మాల వంటివి ఆచరించిన మనిషికి ఇహ సౌఖ్యాలు, మోక్షం లభిస్తాయని పురాణ కథనం.

ఇవి కూడా చదవండి

వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనది.. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. నదుల్లో సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

మేషరాశిలో సంచరించే సూర్యుడు

ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు.. కనుక ఎండలు అధికంగా ఉంటాయి. వేడి నుంచి ఉపశమనం కోసం నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం వలన విశిష్ట ఫలం లభిస్తుందని విశ్వాసం. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, అన్నదానం చేయడం వంటివి విశిష్ట ఫలితాలను ఇస్తుంది.

సంధ్యావందనం చేసి శ్రీ మహా విష్ణువును తులసీదళాలతో పూజించాలి. ఈ నెల నుంచి మూడు నెలల పాటు నారాయణుడు భూమి మీద విహరిస్తూ ఉంటాడని .. అందుకనే విష్ణువుకి ఇష్టమైన తులసీ దళాలను సమర్పించడంతో సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు