Astro Tips: జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. శనివారం ఈ సింపుల్ రెమిడీస్ పాటించి చూడండి..

ఎవరి జాతకంలో శనీశ్వరుడు చెడుస్థానంలో లేదా నీచ స్థానంలో ఉంటే కష్టాలు, నష్టాలను కలిగిస్తాడు.  అయితే తనను శరణు కోరుతూ పూజించే వారిని శనీశ్వరుడు ఆపదలను తొలగిస్తాడు. ఏలినాటి  శని, అర్ధష్టమ శని, వారంత శనితో బాధపడే వారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం తైలాభీషేకం చేయించండి. అంతేకాదు నలుపు దుస్తులను, నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా పదకొండు వారాలు చేస్తే శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. 

Astro Tips: జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. శనివారం ఈ సింపుల్ రెమిడీస్ పాటించి చూడండి..
Lord Shani Dev
Follow us
Surya Kala

|

Updated on: Apr 26, 2024 | 7:39 PM

నవగ్రహాల్లో శనీశ్వరుడు కర్మ ప్రధాత. శనీశ్వరుడు గ్రహాలకధిపతి సూర్యభగవానుడు ఛాయదేవుల తనయుడు. లయకారుడు ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తుడు. శనీశ్వరుడు మనుషులు చేసే కర్మల ను ఫలితాలను అందిస్తాడు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడి ప్రభావం ఉంటే.. వారు అనేక కష్ట, నష్టాలూ ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు జీవితంలో అంతవరకూ ఊహించని విధంగా ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటారు. అందుకనే ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అనుగ్రహం కోసం కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ఎవరి జాతకంలో శనీశ్వరుడు చెడుస్థానంలో లేదా నీచ స్థానంలో ఉంటే కష్టాలు, నష్టాలను కలిగిస్తాడు.  అయితే తనను శరణు కోరుతూ పూజించే వారిని శనీశ్వరుడు ఆపదలను తొలగిస్తాడు. ఏలినాటి  శని, అర్ధష్టమ శని, వారంత శనితో బాధపడే వారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం తైలాభీషేకం చేయించండి. అంతేకాదు నలుపు దుస్తులను, నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా పదకొండు వారాలు చేస్తే శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు.

శనివారం ఈ వస్తువులు పొరపాటున కూడా తీసుకుని రావద్దు

శనిదేవునికి అత్యంత ఇష్టమైన వస్తువులను శనివారం రోజున పొరపాటున కూడా ఇంటికి తీసుకుని రావద్దు అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఇనుప వస్తువులు, నువ్వుల నూనె, చెప్పులు, నవధాన్యాలు, ఉప్పు, కారం  మొదలైనవి వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఇంటికి తీసుకుని రావద్దు. అంతేకాదు ఈ వస్తువులను ఇతరుల నుంచి పొరపాటున కూడా తీసుకోవద్దు.

ఇవి కూడా చదవండి

శనీశ్వరుడు పూజా విధానం..

శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం హనుమంతుడిని లేదా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అంతే కాదు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం చేసినా శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. కష్ట, నష్టాలు దూరమైపోతాయని భక్తులు విశ్వాసం. శనివారం రోజున పేదలకు, గుడి బయట యాచకులకు ఆహారాన్ని అందించడం వలన శనీశ్వరుడు సంతసిస్తాడట. వేసవి కాలంలో దాహార్తిని తీర్చడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు వేడినుంచి ఉపశమం కలిగే విధంగా చెప్పులు, దుస్తులు, ఆహారం ఇలా ఏది దానం చేసినా శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు