AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharata: శ్రీ కృష్ణుడికి అభిమన్యుడి మరణం ముందే తెలుసు.. చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని ఎందుకు రక్షించలేదో తెలుసా..

మహాభారత కథలోని వీర యోధులలో అభిమన్యుడు ఒకడు. అభిమన్యుడు ప్రతి వ్యక్తికి ఒక ప్రేరణ. ఈ యోధుడు మహాభారత యుద్ధంలో ఒక రోజంతా  యోధానుయోధులందరినీ ఒంటరిగా అడ్డుకున్నాడు. తాను ఒక్కడే వేలాది మంది సైనికులతో సమానం అన్న చందంగా యుద్ధంలో పోరాడుతూ అమరవీరుడు అయ్యాడు. అయితే అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడు చూస్తూ నిలబడిపోయాడు. అయితే ఇదంతా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం కోసమేనట 

Mahabharata: శ్రీ కృష్ణుడికి అభిమన్యుడి మరణం ముందే తెలుసు.. చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని ఎందుకు రక్షించలేదో తెలుసా..
Mahabharata Story
Surya Kala
|

Updated on: Apr 26, 2024 | 7:13 PM

Share

పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే ముందుగా అందరి మదిలో మెదిలే పేరు అభిమన్యుడు. పాండవుల మధ్యముడు అర్జునుడు సుభద్రాదేవి ల తనయుడు అభిమన్యు. శ్రీ కృష్ణుడి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విన్యాసాల గురించి అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక మరణించాడు. అయితే అభిమన్యుడి యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. అందుకే శ్రీ కృష్ణుడు కూడా తన ముద్దుల మేనల్లుడు  అభిమన్యుని ప్రాణాలను రక్షించలేదు.

ధర్మాన్ని రక్షించడానికి అవతారం ఎత్తిన దేవతలు

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని ధర్మం రక్షించడానికి జరిగిన యుద్ధం అని పిలుస్తారు. అధర్మం తలెత్తిన ప్రతి సారీ శ్రీ మహా విష్ణువు అవతరిస్తాడు. అలా ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఇతర దేవతలు కూడా జన్మించారు  బ్రహ్మ దేవుడు, దేవతలు కూడా వివిధ ప్రదేశాలలో జన్మించారు. తద్వారా ధర్మాన్ని స్థాపించడంలో శ్రీ కృష్ణ భగవానుడికి సహాయం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ దేవత అవతారమే అభిమన్యుడు

మహాభారత కథలోని వీర యోధులలో అభిమన్యుడు ఒకడు. అభిమన్యుడు ప్రతి వ్యక్తికి ఒక ప్రేరణ. ఈ యోధుడు మహాభారత యుద్ధంలో ఒక రోజంతా  యోధానుయోధులందరినీ ఒంటరిగా అడ్డుకున్నాడు. తాను ఒక్కడే వేలాది మంది సైనికులతో సమానం అన్న చందంగా యుద్ధంలో పోరాడుతూ అమరవీరుడు అయ్యాడు. అయితే అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడు చూస్తూ నిలబడిపోయాడు. అయితే ఇదంతా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం కోసమేనట

ధర్మాన్ని రక్షించడానికి దేవతలు భూమిపై అవతరించినప్పుడు చంద్రుని కుమారుడు వర్చా అభిమన్యుని రూపంలో జన్మించాడు. చంద్రుడు దేవతలతో ఇలా అన్నాడు..  నేను నా ప్రియమైన కొడుకు నా ప్రాణం సమానం నేను వదిలి ఉండలేను. భూమి మీదకు పంపించలేను. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గడం సముచితం కూడా కాదు. అందుకే వర్చ మానవుడుగా అవతరిస్తాడు. అయితే ఎక్కువ కాలం ఉండడు.  ఇంద్రుడి అవతారమైన అర్జునుడి కొడుకుగా పుడతాడు అని చెప్పాడు. శ్రీ కృష్ణుడు, అర్జునుడు బావా బావమరిది అయినా స్నేహితులుగానే ఎక్కువగా ఉండేవారు.

దేవతలు చంద్రునిపై ఆధారపడవలసి వచ్చింది

చంద్రుడు తన కొడుకు వర్చ అవతరించే సమయంలో దేవతల ముందు షరతు పెట్టాడు, శ్రీకృష్ణుడి ముందు తన కొడుకు చక్రవ్యూహంలో చొచ్చుకుపోతాడు..  భీకర యుద్ధం చేస్తూ  గొప్ప యోధులను కూడా ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోజంతా సాయంత్రం వరకు పోరాడి..  చనిపోయి తిరిగి తన దగ్గరకు తిరిగి వస్తాడని తన కోరికను వెల్లడించాడు. దీంతో కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన శౌర్యాన్ని ప్రదర్శించి తండ్రి లేని సమయంలో జరుగుతున్న యుద్ధంలో చక్రవ్యూహంలో ప్రవేశించి వీరులతో పోరాడి చిన్న వయస్సులోనే మరణించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు