- Telugu News Photo Gallery Is it auspicious to have a spider's web in the house? Check Here is details in Telugu
Vastu Tips: ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
సాలీడ్లు అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తాయి. ఇంటి మూలల్లో, ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి. ఓ వారం రోజుల పాటు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే.. ఎక్కడ చూసినా సాలీడు గూడులే కనిపిస్తాయి. మరి ఇలాంటి సాలెగూడులు ఇంట్లో ఉంటే మంచిదా? లేక నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సాలెగూడ్లు ఉంటే డబ్బు కొరత ఏర్పడవచ్చు. మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, కలహాలు ఏర్పడవచ్చు. ఇంట్లో నెగిటివిటీ కూడా ఎక్కువ..
Updated on: Apr 26, 2024 | 5:59 PM

సాలీడ్లు అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తాయి. ఇంటి మూలల్లో, ఇంటి బయట గూడులు కడుతూ ఉంటాయి. ఓ వారం రోజుల పాటు ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే.. ఎక్కడ చూసినా సాలీడు గూడులే కనిపిస్తాయి. మరి ఇలాంటి సాలెగూడులు ఇంట్లో ఉంటే మంచిదా? లేక నష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో సాలెగూడ్లు ఉంటే డబ్బు కొరత ఏర్పడవచ్చు. మీరు చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, కలహాలు ఏర్పడవచ్చు. ఇంట్లో నెగిటివిటీ కూడా ఎక్కువ అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

బెడ్ రూమ్‌లో సాలీడ్లు గూడులు కడితే.. భార్యాభర్తల మధ్య కలహాలు అనేవి పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంటి మూలల్లో సాలెగూడు ఉంటే.. కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బదులు కలుగుతాయి.

పూజ గదిలో సాలెగూడు ఉంటే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి దేవుడి గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేకుంటే అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి.

ఇక వంట గదిలో సాలెగూడు వల్ల అశుభాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. కాబట్టి వంట గది సింక్, మెస్ దగ్గర ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.




