AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో విదేశం వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్‌తో వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లొచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భూటాన్ పెద్ద దేశం కాదు. అయితే ఇక్కడ చూడదగిన ప్రదేశాలకు కొరత లేదు. భూటాన్ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఆ దేశంలో అస్సలు మిస్ చేసుకోకుండా కొన్ని ప్రదేశాలను చూడాల్సిందే. ఈ రోజు ఆ ప్రదేశాల గురించి దీనితో పాటు భూటాన్‌లోకి ప్రవేశించడానికి ఏ పత్రాలు అవసరమో కూడా ఈ రోజు తెలుసుకుందాం..

వేసవిలో విదేశం వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్‌తో వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లొచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Bhutan TourismImage Credit source: Bhutan Tourism
Surya Kala
|

Updated on: Apr 26, 2024 | 5:02 PM

Share

తక్కువ డబ్బుతో విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తుంటే ఈ వేసవి సెలవుల్లో భూటాన్‌కు వెళ్లవచ్చు. భారతదేశానికి పొరుగు దేశం భూటాన్ అందంగా ఉంటుంది. అంతేకాదు యూరప్ కంటే తక్కువ కాదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భూటాన్‌ను సందర్శించడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. అంతేకాదు తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించవచ్చు. భూటాన్ చుట్టూ పర్వతాలతో అందంగా కనిపిస్తుంది.

భూటాన్ పెద్ద దేశం కాదు. అయితే ఇక్కడ చూడదగిన ప్రదేశాలకు కొరత లేదు. భూటాన్ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఆ దేశంలో అస్సలు మిస్ చేసుకోకుండా కొన్ని ప్రదేశాలను చూడాల్సిందే. ఈ రోజు ఆ ప్రదేశాల గురించి దీనితో పాటు భూటాన్‌లోకి ప్రవేశించడానికి ఏ పత్రాలు అవసరమో కూడా ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

పారో: భూటాన్ దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటి పారో ఒకటి. ఆ దేశం వెళ్లిన ప్రతి ఒక్కారు చూడాల్సిన  అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానం. ఇది భూటాన్ రాజధాని థింఫు నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక చారిత్రక, మతపరమైన భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి లోయలే కాకుండా వాస్తుశిల్పం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక అందమైన కోట కూడా ఉంది. దీని దృశ్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

థింపూ : థింఫు భూటాన్ రాజధాని. ఇక్కడ మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. 170 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం కూడా ఉంది. ఇది భూటాన్ దేశగానికి గర్వంగా నిలుస్తుంది. కొండ మీద ఉండడం వల్ల ఇక్కడికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుంటారు.

పునాఖా: ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం చాలా ఇష్టం. థింపూ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు భూటాన్ రాజధాని పునాఖా అని మీకు తెలియజేద్దాం. ఇక్కడికి చేరుకునే మార్గంలో భూటాన్  అత్యంత ప్రసిద్ధ పాస్ – ‘డోచులా’ జలపాతం. ఈ ప్రదేశంలో మీరు కలిసి 108 స్థూపాలు చూస్తారు. ఈ ప్రదేశం దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఏ సమయంలో వెళ్ళాలి

భూటాన్‌ను సందర్శించడానికి ఉత్తమ సీజన్ మార్చి నుండి మే వరకు పరిగణించబడుతుంది. జూన్ వేసవిలో కూడా ఇక్కడ సందర్శించవచ్చు. కానీ ఇక్కడ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు చలి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఏ పత్రాలు అవసరం?

భారత పౌరులు భూటాన్‌కు వెళ్లాలనుకున్నట్లు అయితే వారు కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ఓటరు ID కార్డును తమ వెంట తీసుకెళ్లాలి. అదనంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే వారు తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. మీ వద్ద పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా ఉండాలి. పత్రాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

అనుమతి అవసరం: భారత పౌరులు భూటాన్ వెళ్లేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. అయితే మీకు పర్మిట్ జారీ చేస్తారు. దీని వ్యవధి 7 రోజులు. అయితే, థింపూలో మీరు పర్మిషన్ ను పెంచుకోవచ్చు.

దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి థింపూ వెళితే వన్‌వే విమాన ఛార్జీ రూ.20 నుంచి 25 వేలు. అయితే కొంతమంది భూటాన్‌ను సందర్శించడానికి ప్యాకేజీలను కూడా ప్రకటిస్తున్నాయి. రూ.40 నుంచి 50 వేలకే భూటాన్ వెళ్లేందుకు మంచి ప్యాకేజీలు కూడా లభిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..