AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యన్ అమ్మాయికి భారతీయ వరుడు కావాలట.. యువతి ఫోన్ నెంబర్ అడిగిన పాస్‌పోర్ట్ అధికారి

కొన్ని దేశాలకు చెందిన వారు తమ దేశానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇలాంటి విదేశీయులు భారతదేశంలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న అమ్మాయిలు భారత్‌కు వచ్చి భారతీయ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక అమ్మాయి ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఆమె రష్యా నివాసి. ఆమె పెళ్లి చేసుకోవడానికి  భారతీయ వరుడి కోసం వెతుకుతోంది. ఈ రష్యన్ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా వీడియోలను షేర్ చేసింది, అందులో ఆమె వివిధ ప్రదేశాలలో గోడలపై QR కోడ్‌లతో పోస్టర్లను అతికించడం కనిపిస్తుంది.

రష్యన్ అమ్మాయికి భారతీయ వరుడు కావాలట.. యువతి ఫోన్ నెంబర్ అడిగిన పాస్‌పోర్ట్ అధికారి
Russian WomanImage Credit source: Instagram/dijidol
Surya Kala
|

Updated on: Apr 26, 2024 | 5:50 PM

Share

ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు భారతదేశాన్ని సందర్శించడానికి వస్తారు. దేశంలోని అందమైన  ప్రదేశాలను, సంస్కృతిని చూసి మైమరచిపోతారు. చాలా మంది ప్రజలను ఇక్కడి సంస్కృతి ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని దేశాలకు చెందిన వారు తమ దేశానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇలాంటి విదేశీయులు భారతదేశంలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న అమ్మాయిలు భారత్‌కు వచ్చి భారతీయ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక అమ్మాయి ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఆమె రష్యా నివాసి. ఆమె పెళ్లి చేసుకోవడానికి  భారతీయ వరుడి కోసం వెతుకుతోంది.

ఈ రష్యన్ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా వీడియోలను షేర్ చేసింది, అందులో ఆమె వివిధ ప్రదేశాలలో గోడలపై QR కోడ్‌లతో పోస్టర్లను అతికించడం కనిపిస్తుంది. ఆ పోస్టర్‌లో ‘నేను భారతీయ వరుడి కోసం వెతుకుతున్నాను’ అని రాసి ఉంది. ఇటీవల ఆమె మరొక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో తనకు ఒక వింత సంఘటన జరిగిందని చెప్పింది. ఇది తనను కూడా ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. తాను విమానాశ్రయానికి వెళ్లానని, అక్కడ పాస్‌పోర్ట్ అధికారి తన మొబైల్ నంబర్‌ను రాసుకుని తనకు ఫోన్ చేయమని చెప్పాడని బాలిక చెప్పింది. అయితే ఆ అధికారి తీరు ఆ అమ్మాయికి అస్సలు నచ్చలేదు.

ఇవి కూడా చదవండి

రష్యన్ యువతి వీడియో వైరల్

పాస్‌పోర్ట్ అధికారి చెప్పిన దాని గురించి బాలిక మొదట మొత్తం కథ చెప్పింది. ఆ తర్వాత హిందీలో ‘హే మాన్ ఇది ఎలాంటి ప్రవర్తన’ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో డిజిడోల్ అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 1.8 మిలియన్లు అంటే 18 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 17 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల కామెంట్ చేశారు. ఒక యూజర్ ‘భారతీయ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఏ సమస్యా ఉండదు’ అని రాస్తే, మరొక యూజర్ ‘DGCA , హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ పాస్‌పోర్ట్ అధికారిపై ఫిర్యాదు చేయమని’ రష్యన్ అమ్మాయికి సలహా ఇచ్చాడు.  అంతేకాదు ఈ రష్యన్ అమ్మాయి అందాన్ని ప్రశంసించడంలో విసిగిపోని వినియోగదారుల సంఖ్య కూడా భారీగానే ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?