AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఎక్కడుందో తెలుసా..? గిన్నిస్‌ బుక్‌లో స్థానం.. భారతీయ యువతిపై నెటిజన్ల ప్రశంసలు..

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఎక్కడ ఉందో తెలుసా? చిన్నది అంటే ఈ ఎస్కలేటర్‌కి కేవలం 5 స్టెప్పులు మాత్రమే ఉన్నాయి. ఈ బుల్లి ఎస్కలేటర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎస్కలేటర్ ఎత్తు 83 సెం.మీ, దూరం 2.7 అడుగులు. ప్రజలు కేవలం ఐదు మెట్లు ఎక్కడానికి ఈ ఎస్కలేటర్‌ని ఉపయోగిస్తారు.

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఎక్కడుందో తెలుసా..? గిన్నిస్‌ బుక్‌లో స్థానం.. భారతీయ యువతిపై నెటిజన్ల ప్రశంసలు..
Worlds Smallest Escalator
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2024 | 5:54 PM

Share

మాల్స్ మొదలు రైల్వే స్టేషన్ల వరకు ఇప్పుడు ఎస్కలేటర్లు సర్వసాధారణం. ఒకప్పుడు ఇది యూజ్‌ చేసేందుకు చాలా మంది భయపడేవారు. కానీ, ఇప్పుడు అది అందరికీ సర్వసాధారణమైపోయింది. తద్వారా మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. అలసట ఉండదు. కేవలం ఒక అడుగు, ఈ ఎస్కలేటర్ మిమ్మల్ని ఎగువ లేదా దిగువ అంతస్తుకు తీసుకువెళుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజలకు రోజువారీ ప్రయాణంలో ఎస్కలేటర్లు ప్రధాన భాగంగా మారాయి. దీంతో అంతస్తులు ఎక్కడానికి కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే, ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఎక్కడ ఉందో తెలుసా? చిన్నది అంటే ఈ ఎస్కలేటర్‌కి కేవలం 5 స్టెప్పులు మాత్రమే ఉన్నాయి. ఈ బుల్లి ఎస్కలేటర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఎస్కలేటర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇది ఖచ్చితంగా ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఆతృత, ఆరాటం మీలో పెరిగిపోయి ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా.. ప్రపంచంలోనే అత్యంత చిన్న ఎస్కలేటర్ జపాన్‌లో ఉంది. జపాన్‌లోని ఎస్కలేటర్ ఎత్తు 83 సెం.మీ, దూరం 2.7 అడుగులు. ప్రజలు కేవలం ఐదు మెట్లు ఎక్కడానికి ఈ ఎస్కలేటర్‌ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ జపాన్‌లోని డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kavi Gomase (@kavi_gomase)

ఈ వీడియోలో మీరు గమనిస్తే, యువతి వెనుక ఎస్కలేటర్ కనిపిస్తుంది. ఈ ఎస్కలేటర్ వైపు కేవలం 5 మెట్లు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఇది ఐదు మెట్ల దూరం ఉన్న ఎస్కలేటర్. ఇప్పుడు ఐదు మెట్లు ఎక్కడానికి ఎస్కలేటర్‌ను ఎవరు ఉపయోగిస్తారు అని మీరు ఆశ్చర్యపోవచ్చాఉ.? ఐతే మీరు ఈ వీడియోలో చూడండి. కేవలం ఐదు మెట్లు ఎక్కడం కాకుండా, ప్రజలు ఈ చిన్న ఎస్కలేటర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు జపాన్‌లో ఉన్న kavi_gomase అనే భారతీయ అమ్మాయి ఈ వీడియోను షేర్ చేసి ఈ సమాచారాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భారతీయ యువతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..