Watch Video: రిటైర్మెంట్ తర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు భలే ఎంజాయ్ చేస్తున్న దంపతులు..
తాము ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణాన్ని మొదలుపెట్టామని చెప్పారు. రోడ్ ట్రిప్‌లో భాగంగా వారు లంచ్ ప్రిపేర్ చేసేందుకు ఔరంగాబాద్ హైవే పక్కనే ఉన్న ఒక చింతచెట్టు కింద కొద్దిసేపు ఆగారు. వీడియోలో భార్య వంట చేసేందుకు కూరగాయలను సిద్ధం చేస్తుండగా, భర్త ఆమెకు సహకరించడం కనిపించింది.. ఆపై ఇద్దరూ ఫోల్డబుల్ టేబుల్, ఛైర్స్‌లో సేదతీరుతూ వారు తయారు చేసుకున్న భోజనం ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
భవిష్యత్తులో సుఖంగా ఉండేందుకు, మెరుగైన సౌకర్యాలు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కష్టపడి పనిచేస్తారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత చాలా మంది తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. కుటుంబానికి, ముఖ్యంగా వారి భాగస్వామికి పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. ఈరోజు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రిటైర్డ్ జంట తమ సొంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. అతను తన రిటైర్‌మెంట్ సమయాన్ని ఆనందంగా గడిపేందుకు గానూ రోడ్ ట్రిప్‌ను మొదలుపెట్టాడు. ఈ ప్రత్యేక జంట గురించి తెలుసుకుందాం.
రోడ్డు ప్రయాణం చేయడం చాలా మంది ప్రయాణికుల కల. అలా రిటైర్డ్ అయిన ఓ జంట ఈ కలను సాకారం చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా తమ ప్రయాణాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ జంట జనవరిలో ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు తమ 52 రోజుల ప్రయాణాన్ని ప్రారంభించారు. రోడ్ ట్రిప్ కోసం వారు ఒక చిన్న వంటగదితో ఉన్న ఒక వ్యాన్‌ని కొనుగోలు చేశారు. ఈ దంపతులు షేర్ చేసిన వీడియోలో వారు కారులో ఆహారం వండడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రిటైర్డ్ దంపతుల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే.!
View this post on Instagram
వైరల్ వీడియోలో కనిపించినట్టుగా వారు కారులోనే ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి కిచెన్‌లో వంట చేసుకుని ఇష్టంగా ఆరగిస్తున్నారు. తామిద్దరం రిటైర్డ్ ఉద్యోగులమని, తమ జీవితంలో వారికిది సెకండ్ ఇన్నింగ్స్‌గా వారు పోస్ట్‌లో రాసుకొచ్చారు. తాము ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణాన్ని మొదలుపెట్టామని చెప్పారు. రోడ్ ట్రిప్‌లో భాగంగా వారు లంచ్ ప్రిపేర్ చేసేందుకు ఔరంగాబాద్ హైవే పక్కనే ఉన్న ఒక చింతచెట్టు కింద కొద్దిసేపు ఆగారు. వీడియోలో భార్య వంట చేసేందుకు కూరగాయలను సిద్ధం చేస్తుండగా, భర్త ఆమెకు సహకరించడం కనిపించింది.. ఆపై ఇద్దరూ ఫోల్డబుల్ టేబుల్, ఛైర్స్‌లో సేదతీరుతూ వారు తయారు చేసుకున్న భోజనం ఎంజాయ్ చేస్తూ లంచ్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోకు 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
మీరు కూడా వారి Instagram ఖాతా @retiredpunjabiలో ఈ జంట ప్రయాణాన్ని ఫాలో కావొచ్చు. రిటైర్డ్ జంట రోడ్ ట్రిప్‌లకు వెళుతున్నట్లు, వారి హాబీలకు ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్లు కామెంట్స్ రూపంలో ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. యాభై ఏళ్లు దాటిన తర్వాత కూడా తమ జీవితాలను సంతోషంగా ఎలా గడపవచ్చో ఉదాహరణగా చూపించారు ఈ రిటైర్డ్ జంట అంటూ పలువురు పొగడ్తలు కుమ్మరించారు.
ఇటీవల, అతని ఇన్‌స్టాగ్రామ్ వీడియోకు 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో దంపతులు ఔరంగాబాద్ హైవే పక్కన ఉన్న చింతచెట్టు కింద భోజనం కోసం ఆగారు. వారి భోజనంలో ప్రత్యేకత ఏమిటో నెటిజన్లకు వివరిస్తూ.. మేం చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..