Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 27, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 27 April 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 27, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 27, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకోకుండా కొందరు ప్రముఖులు పరిచయమవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలకు తిరుగుండదు. మిత్రులు అండగా నిలబడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతల భారంతో ఇబ్బంది పడతారు. రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశా జనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. సాటి ఉద్యోగుల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగాల విష యంలో ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయానికి దీటుగా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టిం చడం వల్ల నష్టపోతారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన ఆఫర్ అందుకుంటారు. పిల్లలు చదు వుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. పిల్లలు ఉత్సాహపరు స్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. గ్రహ బలం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ బాధ్యతల కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశముంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. పిల్లలు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇతరులకు ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు కూడా పెట్టుకోవద్దు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా సానుకూలపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరు గుతుంది. కొత్త ఉద్యోగావకాశాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. జీవిత భాగస్వామికి ఆశించిన శుభవార్త అందు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశముంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు చదువుతో సంబంధం లేని ఆఫర్లు అంది వస్తాయి. ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లలు చదువుల్లో కష్టపడాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు విదే శాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం నిశ్చయం అవుతుంది. పిల్లల ద్వారా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెడతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సొంత పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొం టారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో తేడా కార ణంగా స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. బంధువులకు సహాయంగా చేయాల్సి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.