Guru Gochar 2024: వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!

దేవ గురువైన బృహస్పతి ఈ నెల 30 తేదీ రాత్రి నుంచి మేషం నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆదాయపరంగా ఊహించని అభివృద్ధి జరగబోతుంది. గురువు వృషభ రాశిలో 2025 మే 14 వరకూ సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కాలంలో అనేక శుభ పరిణామాలు కొన్ని రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకోబోతున్నాయి.

Guru Gochar 2024: వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
Guru gochar 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 26, 2024 | 6:10 PM

దేవ గురువైన బృహస్పతి ఈ నెల 30 తేదీ రాత్రి నుంచి మేషం నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆదాయపరంగా ఊహించని అభివృద్ధి జరగబోతుంది. గురువు వృషభ రాశిలో 2025 మే 14 వరకూ సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కాలంలో అనేక శుభ పరిణామాలు కొన్ని రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకోబోతున్నాయి. గురువు రాశి మార్పు వల్ల మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అనేక శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి జీవితంలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆర్థికపరంగా అనేక విజయాలను సాధిస్తారు. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పదోన్నతికి అవకాశ ముంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపా రాల్లో, షేర్లల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబ జీవితం నిత్యకల్యాణం, పచ్చతోరణంలా ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థికపరంగానే కాక, కెరీర్ పరంగా కూడా ఊహిం చని పురోగతి ఉంటుంది. పదోన్నతులతో పాటు భారీగా జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది పెట్టుబడికి భారీ లాభాలు అందుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడు తుంది. వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  3. సింహం: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన విషయాలన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు రావడం ప్రారంభం అవుతుంది. వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. ఇంట్లో ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో, భాగ్య కారకుడైన గురువు సంచారం వల్ల జాతకంలో ఎటువంటి దోషా లున్నా తొలగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవ కాశముంది. డబ్బు సంపాదించాలన్న తాపత్రయం ఎక్కువవుతుంది. విదేశీ సొమ్ము అనుభ వించే అవకాశం కూడా ఉంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. సంతాన యోగం కూడా ఉంది. కుటుంబంలో అనేక సమస్యలు, ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
  5. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితంలో అనేక విధాలుగా పురోగతి చెందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశముంది. ఆర్థికంగా సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. సామాజికంగా కూడా స్థితిగతులు మారిపోతాయి.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గుర సంచారం వల్ల అనేక టెన్షన్లు, ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు సంపాదించాలనే ఆరాటం ఎక్కువవుతుంది. అనేక మార్గాల్లో ధన సంపాదనకు అవకాశముంది. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక లావాదేవీలు జరపడానికి, స్పెక్యులేషన్లో పాల్గొనడానికి అవకాశముంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలుంటాయి. వ్యాపార ధోరణి పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!