Kahala Yoga: కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన.. ఖల యోగంతో ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు..!

కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన చోటు చేసుకుంది. అంటే మీన రాశి అధిపతి అయిన గురువు కుజుడు అధిపతి అయిన మేష రాశిలోనూ, మేష రాశికి అధిపతి అయిన కుజుడు గురువు అధిపతి అయిన మీన రాశిలోనూ సంచారం ప్రారంభించడం జరిగింది. ఈ పరివర్తన మే 2వ తేదీ వరకూ కొనసాగుతుంది. గురు, కుజుల మధ్య పరివర్తన జరిగినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కానీ..

Kahala Yoga: కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన.. ఖల యోగంతో ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు..!
Kahala Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 26, 2024 | 5:25 PM

కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన చోటు చేసుకుంది. అంటే మీన రాశి అధిపతి అయిన గురువు కుజుడు అధిపతి అయిన మేష రాశిలోనూ, మేష రాశికి అధిపతి అయిన కుజుడు గురువు అధిపతి అయిన మీన రాశిలోనూ సంచారం ప్రారంభించడం జరిగింది. ఈ పరివర్తన మే 2వ తేదీ వరకూ కొనసాగుతుంది. గురు, కుజుల మధ్య పరివర్తన జరిగినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కానీ, కొన్ని రాశులకు చెడు ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఒక శుభ స్థానంతో ఒక దుస్థానానికి పరివర్తన జరగడాన్ని జ్యోతిషశాస్త్రంలో ‘ఖల యోగం’గా అభివర్ణస్తారు. దీనివల్ల కొన్ని కష్టనష్టాలు అనుభవానికి వస్తాయి. మేషం, వృషభం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు కొద్ది రోజుల పాటు ఈ ఖల యోగ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశి నాథుడైన కుజుడికి వ్యయ స్థానాధిపతి గురువుతో పరివర్తన జరిగినందువల్ల ఈ రాశి వారికి ఖల యోగం ఏర్పడింది. దీని ఫలితంగా అనవసర ఖర్చులు విపరీతంగా పెరగడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, సన్నిహితులు మోసం చేయడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గడం వంటివి జరుగుతాయి. ప్రతి చిన్న పనికీ తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పటడుగులు వేసే అవకాశముంది.
  2. వృషభం: ఈ రాశికి లాభ, వ్యయాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఖల యోగం ఏర్పడింది. దీని ఫలితంగా కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతూ ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మంచి ఉద్యోగావకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. కొందరు సన్నిహి తులతో అకారణ వైషమ్యాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసులు నిరుత్సాహం కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
  3. సింహం: ఈ రాశికి అష్టమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. ఫలితంగా రావలసిన డబ్బు చేతికి అందకుండా ఆగిపోతుంది. విదేశీ ఉద్యోగాల్లో చికాకులు తలె త్తుతాయి. విదేశీయానానికి ఇబ్బందులేర్పడతాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుత్సాహం కలుగుతుంది. బంధువుల విషయంలో దుర్వార్తలందుతాయి. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.
  4. కన్య: ఈ రాశికి సప్తమ, అష్టమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. విలువైన వస్తువులు కోల్పోవడం లేదా చోరీకి గురి కావడం జరగ వచ్చు. విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటు పడడం కూడా జరుగుతుంది. బంధుమిత్రుల కారణంగా నిందలు పడడం జరుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
  5. తుల: ఈ రాశికి షష్ట, సప్తమ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఖల యోగం ఏర్పడింది. దీనివల్ల కుటుంబంలో ఒడిదుడుకులు తలెత్తే అవకాశముంటుంది. మిత్రుల్లో కొందరు శత్రువు లుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఇతరులకు హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి భంగపడతారు. రాజపూజ్యాలు తగ్గి, అవమానాలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు.
  6. వృశ్చికం: ఈ రాశికి పంచమ, షష్టాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఖల యోగం ఏర్పడింది. దీనివల్ల అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఒకపట్టాన ఏ పనీ కలిసి రాదు. ముఖ్య మైన ప్రయత్నాలు, కీలకమైన వ్యవహారాలు వాయిదా పడుతుంటాయి. కొన్ని ఆందోళనకర సంఘటనలు జరుగుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.