కెరీర్ లో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించాల్సిందే..

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కెరీర్‌లో విజయం సాధించడానికి కొన్ని చర్యలను పేర్కొన్నాడు. వాటిని జీవితానికి అన్వయించుకుంటే కెరీర్‌లో విజయానికి అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి. చాణక్యుడు కెరీర్ లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి 5 విషయాలను త్యాగం చేయడం గురించి పేర్కొన్నాడు. వీటిని అనుసరించడం ద్వారా సులభంగా విజయం సాధించవచ్చు.

కెరీర్ లో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించాల్సిందే..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 11:46 AM

ఎవరైనా సరే కెరీర్‌లో విజయం సాధించాలనుకుంటే.. అవసరం అయినప్పుడు కొన్ని విషయాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి త్యాగం చేయడం ద్వారా మాత్రమే కెరీర్‌లో విజయం సాధించగలుగుతారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కెరీర్‌లో విజయం సాధించడానికి కొన్ని చర్యలను పేర్కొన్నాడు. వాటిని జీవితానికి అన్వయించుకుంటే కెరీర్‌లో విజయానికి అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి. చాణక్యుడు కెరీర్ లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి 5 విషయాలను త్యాగం చేయడం గురించి పేర్కొన్నాడు. వీటిని అనుసరించడం ద్వారా సులభంగా విజయం సాధించవచ్చు.

ఎప్పుడూ గర్వపడకండి: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎవరైనా కెరీర్‌లో విజయం సాధించిన తర్వాత.. దానిని కొనసాగిస్తూ ఉండడం ఒక పెను సవాల్. కనుక జీవితంలో విజయం సాధించాలంటే, ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే అహంకారం వ్యక్తి పతనానికి కారణమవుతుంది. కనుక అహంకారాన్ని వదులుకోవాలి.

తప్పుల నుంచి పాఠం నేర్చుకోండి: చాణక్యుడు అభివృద్ధిని నమ్ముకో మని చెప్పాడు. వృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించండి. కొత్త దాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టండి. ఇతరుల అభిప్రాయాన్ని స్వీకరించండి. మీ తప్పుల నుంచి కొత్తది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. అన్ని పనులను చేయడానికి ప్రయత్నించండి. తప్పులు జరిగితే వాటి నుంచి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

ఇతరులకు సహాయం: ఆచార్య చాణక్య ప్రకారం కెరీర్ లో విజయం సాధించడానికి నెట్‌వర్కింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిశ్రమలోని నిపుణులతో కనెక్ట్ అవ్వండి. కాన్ఫరెన్స్‌లకు హాజరవ్వండి. సంబంధిత గ్రూపులు లేదా అసోసియేషన్‌లలో చేరండి. అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోండి. ఇతరులకు  సహకరించడం.. ఇతరుల నుంచి నేర్చుకోవడం కొత్త అవకాశాలను తెస్తుంది. కనుక ఇతరులకు సహాయం చేయాల్సి వస్తే ఎప్పుడూ వెనుకడుగు వేయకండి.

బలాలు, బలహీనతలు: కెరీర్ లో ఎదగాలంటే మీ నైపుణ్యాలు, ఆసక్తులు, అభిరుచికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఇతరుల బలాలు, బలహీనతలను గుర్తించి, విజయాన్ని సాధించడంలో సహాయపడే మార్గాన్ని ఎంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు.

జ్ఞానం ప్రాముఖ్యత: ఆచార్య చాణక్యుడు జ్ఞానం ప్రాముఖ్యతపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. నిరంతర అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధిలో సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కెరీర్ విజయాన్ని సాధించవచ్చు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పొందండి. ఇలా చేయడం వలన విజయం  కొత్త శిఖరాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. విజయం సాధించాలంటే జ్ఞానానికి మరొక ప్రత్యామ్నాయం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు