చేతులు పోగొట్టుకున్నా కాళ్లతో కారు నడపడం నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందిన యువకుడు

30 ఏళ్ల తాన్సేన్ కథ సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. పెరమ్‌హూర్ నివాసి అయిన తాన్‌సేన్‌కు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. తాన్సేన్‌కి కార్లు నడపడం అంటే ఇష్టం. అయితే అతడు తన రెండు చేతులను కోల్పోయిన తర్వాత డ్రైవింగ్ చేయలేనని భావించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన విక్రమ్ అగ్నిహోత్రి అనే వ్యక్తి గురించి విన్న తర్వాత తనలో మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనే కోరిక తలెత్తిందని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాన్సేన్ చెప్పాడు.

చేతులు పోగొట్టుకున్నా కాళ్లతో కారు నడపడం నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందిన యువకుడు
Tansen Driving His Car Using LegsImage Credit source: ANI
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 10:58 AM

కలలు కనండి.. ఆ కల నెరవేరే వరకూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నించండి అన్న కలామ్ మాటలను ఓ యువకుడు స్ఫూర్తిగా తీసుకున్నాడు. 10 ఏళ్ల వయసులో కాళ్లు పోగొట్టుకున్నా పట్టుదలతో తన అభిరుచిని నెరవేర్చుకున్నాడు తమిళనాడుకు చెందిన తాన్సేన్. కేవలం 10 సంవత్సరాల వయస్సులో తాన్సేన్ విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. అయితే అతనిలో  ఉత్సాహం తగ్గలేదు, అభిరుచిలో మార్పు లేదు. తాన్సేన్ కు కార్లు నడపడం అంటే ఇష్టం. తన అభిరుచిని నెరవేర్చుకున్నాడు. తమిళనాడులో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి వికలాంగుడు అయ్యాడు.

30 ఏళ్ల తాన్సేన్ కథ సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. పెరమ్‌హూర్ నివాసి అయిన తాన్‌సేన్‌కు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. తాన్సేన్‌కి కార్లు నడపడం అంటే ఇష్టం. అయితే అతడు తన రెండు చేతులను కోల్పోయిన తర్వాత డ్రైవింగ్ చేయలేనని భావించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన విక్రమ్ అగ్నిహోత్రి అనే వ్యక్తి గురించి విన్న తర్వాత తనలో మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనే కోరిక తలెత్తిందని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాన్సేన్ చెప్పాడు. ఎందుకంటే అగ్నిహోత్రికి కూడా రెండు చేతులు లేవు. అయినప్పటికీ అగ్నిహోత్రి కొన్నాళ్ల క్రితమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాడు. అదే సమయంలో కేరళకు చెందిన జిలుమోల్ మారియెట్ థామస్ అనే మహిళ కూడా లైసెన్స్ పొందింది. ఇంతమంది వ్యక్తులకు సంబంధించిన వార్తలు విన్న తర్వాత తాన్సేన్ కూడా ప్రేరణ పొందాడు.

10 ఏళ్ల వయసులో రెండు చేతులు కోల్పోయాడు

తాన్సేన్ మాట్లాడుతూ, ‘తనకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. ప్రమాదం జరిగిందని అప్పుడు  రెండు చేతులు పోగొట్టుకున్నానని వెల్లడించాడు. అయితే తన ఫ్రెండ్స్ కు 18 ఏళ్లు వచ్చేసరికి  అందరికీ  డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చాయి. ఆ సమయంలో తనకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే తాను అలా లైసెన్స్ తీసుకోలేను కారు నడపలేనని బాధపడినట్లు పేర్కొన్నాడు. అప్పుడు తాను లైసెన్స్ పొందడం ముఖ్యం అనుకున్నాను. మధ్యప్రదేశ్‌కు చెందిన అగ్నిహోత్రి గురించి వార్తలు విన్నాను.  భారతదేశంలో చేతులు లేని వ్యక్తులు లైసెన్స్ పొందడానికి అతను నన్ను ప్రేరేపించాడు. తాజాగా కేరళలో ఓ అమ్మాయి లైసెన్స్ కూడా పొందింది.

ఇవి కూడా చదవండి

3 నెలల కఠినమైన శిక్షణ

కారు నడపాలనే కలతో తాన్సేన్ చేతులు లేకుండా కాళ్లతో కారు నడపడం నేర్చుకోవడం ప్రారంభించాడు. కొత్త మారుతీ స్విఫ్ట్ కారు కొన్నాడు. అందులో కొన్ని మార్పులు చేసి మూడు నెలల పాటు నిరంతరం శిక్షణ ఇచ్చారు. కారు కొని దానిని నడపడానికి ప్రయత్నించాడు. కుడి పాదం స్టీరింగ్ వీల్‌పై ఉంచి ఎడమ పాదం బ్రేక్ , యాక్సిలరేటర్‌పై ఉంచి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మూడు నెలల పాటు కార్ డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుని ఆ తర్వాత ఆర్‌టీఓకి వెళ్లాడు. RTO అధికారులు లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళనాడులో ఇలాంటి లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తిని నేనే అని చెప్పాడు. దీని తర్వాత నాలాంటి వారికి చాలా తేలికగా లైసెన్స్ లభిస్తుందని తాను భావిస్తున్నానని..  అయితే దీని కోసం వారు పూర్తి అంకితభావంతో డ్రైవింగ్‌పై కూడా దృష్టి పెట్టాలి. ఏదో ఒకటి చెప్పి మీరు లైసెన్స్ పొందలేరు. అంకితభావం కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు తాన్సేన్.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..